ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-10-19T17:53:06+05:30

సీఎం జగన్ రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూ.గో. జిల్లా: సీఎం జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసమే అప్పులు చేస్తున్నామని ఆర్థికమంత్రి బుగ్గన మాట్లాడుతున్నారని, ఏపీ ఆర్థిక వ్యవస్థపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధారాలతో సహా వాస్తవాలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉండవల్లి చేసిన వ్యాఖ్యలపై స్పందించలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని, మోదీ, అమిత్‌షా చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారని ఎద్దేవా చేశారు. ఏపీలో ఆర్థికాభివృద్ధి ఏమాత్రం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరంపై కేంద్రంతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్‌కు లేదన్నారు. రూ. 55 వేల కోట్లు పోలవరం కోసం ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించటం లేదన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నోరు విప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంపై అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని నవంబర్‌లో కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ అదానీ ప్రదేశ్‌గా మారబోతోందని రామకృష్ణ అన్నారు.


Updated Date - 2021-10-19T17:53:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising