ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులకు కరోనా

ABN, First Publish Date - 2021-05-11T13:20:23+05:30

ఆంధ్రప్రదేశ్ - చత్తీస్ ఘఢ్ సరిహద్దులలో మావోయిస్టులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ - చత్తీస్‌ఘఢ్ సరిహద్దులలో మావోయిస్టులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. పోలీసు నిఘా వర్గాలకు ఉన్న సమాచారం మేరకు జిల్లా పోలీసు కార్యాలయం దీనిపై ఓ ప్రకటనను విడుదల చేసింది. సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన గాలికొండ దళం, బికేఈజీ డీవీసీ దళం, కుంట ఏరియా కమిటీ దళాలకు చెందిన మావోయిస్టు నాయకులకు, దళ సభ్యులకు, మిలీషియా సభ్యులు కరోనా బారిన పడినట్లు పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు. దళంలో సభ్యులు దగ్గు, ఒళ్ళనొప్పులు, జలుబు తదితర  సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. మావోయిస్టులు  జనజీవన స్రవంతిలోకి వచ్చి కరోనాకి సరైన చికిత్సను సకాలంలో ఉచితంగా పొందవచ్చని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. ‘‘మావోయిస్టు అగ్రనాయకులారా మీ మూర్ఖత్వంతో దళసభ్యులను నిర్బంధంలో ఉంచి వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు..దళసభ్యులు, నాయకులు సరైన నిర్ణయం తీసుకొని పోలీసులను ఆశ్రయిస్తే మీ చికిత్సకు, మీ ప్రాణాలకు, మీ పునరావసానికి మాది భరోసా’’ అంటూ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-11T13:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising