ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామపక్ష, రైతు సంఘాల నాయకుల గృహ నిర్బంధం

ABN, First Publish Date - 2021-10-19T05:32:12+05:30

భానుగుడి (కాకినాడ), అక్టోబరు 18: అజయ్‌ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలనే డిమాండ్‌తో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆల్‌ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం తలపెట్టిన రైల్‌రోకో జరగకుండా వామపక్ష నాయకులను పోలీసులు ఉదయం నుం

అక్రమ అరెస్టులను నిరసిస్తూ కాకినాడలో నినాదాలు చేస్తున్న వామపక్ష నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భానుగుడి (కాకినాడ), అక్టోబరు 18: అజయ్‌ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలనే డిమాండ్‌తో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆల్‌ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం తలపెట్టిన రైల్‌రోకో జరగకుండా వామపక్ష నాయకులను పోలీసులు ఉదయం నుంచి గృహ నిర్బంధం చేశారు. సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, రైతు, కార్మిక సంఘాల నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడ కలెక్టరేట్‌  నుంచి అచ్చుతాపురం రైలు గేటు వద్దకు ర్యాలీగా వెళ్తున్న విప్లవ రైతు, కార్మిక సంఘాల నాయకులను కూడా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఢిల్లీలో రైతు ఉద్యమాలకు మద్దతుగా చేస్తున్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో అణగదొక్కుతోందని విమర్శించారు. రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా హౌస్‌ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, ఈ చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి మద్దతు ఇస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని, వారు చూస్తూ ఊరుకోరని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాని తక్షణం బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-19T05:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising