ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి పన్ను జీవోలకు నిరసనగా ధర్నా

ABN, First Publish Date - 2021-06-23T05:29:58+05:30

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ కార్యా లయం వద్ద మంగళవారం బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) ఆధ్వర్యంలో జీవో నెంబరు 196, 197, 198లకు వ్యతిరేకంగా ధర్నా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 22: రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ కార్యా లయం వద్ద మంగళవారం బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) ఆధ్వర్యంలో జీవో నెంబరు 196, 197, 198లకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్లమెంట్‌ కో ఆర్డినేటర్లు పట్నాల విజయ్‌కుమారర్‌, ఇసుకపట్ల రాం బాబు, రూరల్‌ అధ్యక్షుడు గెడ్డం ప్రసాద్‌, సిటీ అధ్యక్షుడు మోర్త మోహన్‌కృష్ణ మాట్లాడుతూ ఆస్తి పన్ను జీవోలకు వ్యతిరేకంగా బీఎస్పీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా చేస్తున్నట్టు చెప్పారు. కరోనా కష్టకాలంలో దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే సాయపడాల్సింది పోయి పన్నులు పెంచి ఇబ్బంది పెట్టడం సరికాదని విమర్శించారు. కార్పొరేట్‌ రంగాలకు కేంద్ర ప్రభుత్వం రూ.23 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించి ప్రజలపై పన్నుల భారం మోపడం దారుణమని, పన్నుల జీవోలను ఉపసంహరించుకోవ డంతోపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలన్నారు. ధర్నాలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు వైరాల అప్పారావు, దళిత నాయకులు బి.జార్జ్‌ ఆంటోని, నక్కా వెంకటరత్నం, సీహెచ్‌వీ రత్నం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising