ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏజెన్సీలో జీడిపిక్కల ప్రోసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు

ABN, First Publish Date - 2021-03-06T06:07:45+05:30

ఏజెన్సీలో 61 వందన వికాస కేంద్రాల ద్వారా జీడిపిక్కల ప్రోసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, మార్చి 5: ఏజెన్సీలో 61 వందన వికాస కేంద్రాల ద్వారా జీడిపిక్కల ప్రోసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య అన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఏడు మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ జీడిమామిడి పిక్కలు, పసుపు, చింతపండు తదితర ఉత్పత్తులను వందన వికాస కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నట్టు ఆయన చెప్పారు. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా వివిధ పథకాలపై అ వగాహన కల్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. 

  • దిశా చట్టంపై అవగాహన కల్పించాలి

దిశా చట్టంపై మహిళా సంఘాలు, అంగనవాడీ కార్యకర్తలకు గ్రామ సచివాలయ మహిళా పోలీసులు అవగాహన కల్పించాలని ఐటీడీఏ పీవో అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో వెలుగు ఏపీఎంలు, గిరిజన సంక్షేమశాఖ డీడీ, ఏటీడబ్ల్యువో, సీడీపీవోలు, సచివాలయ మహిళా పోలీసులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో కౌన్సిలింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏఎస్పీ బిందూమాధవ్‌ మాట్లాడుతూ దిశా చట్టం ద్వారా  యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఆయా సమావేశాల్లో డీడీ ఎం.సరస్వతి, ఏడీఎంహెచవో వంశీ, వెలుగు ఏపీడీ చిన్నశ్రీనివాసరావు, ఏటీడబ్ల్యువోలు సుజాత, శంభుడు, ఎస్‌వో వెంకటేశ్వరరావు, సీడీపీవోలు జి.వరహాలు, కాంత్రికుమారి, ఏపీఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T06:07:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising