ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-01-24T06:22:08+05:30

కాట్రేనికోన పోలీసులు తమను కొట్టడమే కాకుండా వేధింపులకు గురి చేస్తున్నారంటే ఇద్దరు శనివారం కాట్రేనికోన గేట్‌ సెంటర్‌లో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మహత్యకు యత్నిస్తున్న బాధితులు 

కాట్రేనికోన, జనవరి 23: కాట్రేనికోన పోలీసులు తమను కొట్టడమే కాకుండా వేధింపులకు గురి చేస్తున్నారంటే ఇద్దరు శనివారం కాట్రేనికోన గేట్‌ సెంటర్‌లో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పల్లం గ్రామానికి చెందిన పాలెపు రాజు, మల్లాడి భూషణం కుటుంబాల మధ్య కొంత కాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. పాలెపు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లాడి భూషణం కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మల్లాడి కుటుంబ సభ్యులు శనివారం కాట్రేనికోన గేట్‌ సెంటర్‌లో ప్రధాన రహదారిపై అరగంట సేపు ఆందోళన చేశారు. తామిచ్చిన ఫిర్యాదును పక్కన పెట్టి ఎమ్మెల్యే సమీప బంధువు ఒత్తిడి మేరకు పోలీసులు తమను వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. పోలీసుల దౌర్జన్యానికి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని కుటుంబ యజమాని భూ షణం, భార్య అనసూయ, కుమారుడు విజయ్‌ పెట్రోలు పోసుకునేందుకు ప్రయత్నించారు. గ్రామస్థులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ప్రత్యర్థి వర్గంపై కేసు నమోదు చేశారు. సరిహద్దు తగాదా అంశంపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు  కేసులు నమోదు చేసినట్టు ఎస్‌.ఐ షేక్‌ జబీర్‌ తెలిపారు.

Updated Date - 2021-01-24T06:22:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising