ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిఠాపురం మునిసిపల్‌ కార్యాలయం వద్ద చాకిరేవు

ABN, First Publish Date - 2021-07-08T07:04:53+05:30

పిఠాపురం పట్టణంలోని ఏకేపీఎం స్కూలు సమీపంలోని రజకవృత్తి నిర్వహించుకుంటున్న దోబీఘాట్‌ స్థలాన్ని అర్బన్‌హెల్త్‌ సెంటర్‌కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రజకవృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మునిసిపల్‌ కార్యాలయం వద్ద బుధవారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోబీఘాట్‌ స్థలం ఇతర అవసరాలకు కేటాయించడంపై వినూత్న నిరసన 

పిఠాపురం, జూలై 7: పిఠాపురం పట్టణంలోని ఏకేపీఎం  స్కూలు సమీపంలోని రజకవృత్తి నిర్వహించుకుంటున్న దోబీఘాట్‌ స్థలాన్ని అర్బన్‌హెల్త్‌ సెంటర్‌కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రజకవృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మునిసిపల్‌ కార్యాలయం వద్ద బుధవారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు. చాకిరేవు నిర్వహించారు. బట్టలు తెచ్చి అక్కడే ఉతికి ఆరవేశారు. తాము ఏళ్ల తరబడి వృత్తి నిర్వహించుకుంటున్న స్థలాలును ఇతర అవసరాలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. తాము వృత్తి ఎలా చేసుకోగలుగుతామని వారు అన్నారు. అందుకే పురపాలకసంఘ కార్యాలయం వద్ద తమ నిరసనను చాకిరేవు ద్వారా తెలియజేశామని చెప్పారు. తక్షణం ప్రతిపాదనలు విరమించుకోకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరయ్య, జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు, కొజ్జవరపు నాగేశ్వరరావు, పెదపూడి చంటి, పొన్నాడ సూర్యనారాయణ, ఎ.రాజు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-08T07:04:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising