రహదారుల దుస్థితిపై టీడీపీ వినూత్న నిరసన
ABN, First Publish Date - 2021-08-18T06:27:30+05:30
రహదారులపై గుంతలు పూడ్చడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
- పిఠాపురంలో గుంతవద్ద ఫ్రిజ్‌కు సత్కారం
పిఠాపురం, ఆగస్టు 17: రహదారులపై గుంతలు పూడ్చడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పిఠాపురం పట్టణంలోని వన్‌వే ట్రాఫిక్ రోడ్డులో స్టువర్టుపేట సమీపంలో కల్వర్టుకు కన్నం(గుంత) పడింది. దీన్ని పూడ్చాలని పలుమార్లు అధికారులు విన్నవించినా ఫలితం లేకపోవడంతో అక్కడికి సమీపంలోని ఒకషాపు నిర్వాహకుడు పాత ఫ్రిజ్‌ను గుంతలో ఉంచాడు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వర్మ ఆధ్వర్యంలో నాయకులు అక్కడ గుంతలో ఉంచిన ఫ్రిజ్ అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ సత్కారం చేశారు. నిరసనలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్, మున్సిపల్ టీడీపీ ఫ్లోర్‌లీడర్ అల్లవరపు నగేష్, నాయకులు కోరుప్రోలు శ్రీనివాస్, కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీనివాస్, కరణం చిన్నారావు, నల్లా శ్రీను, పిల్లి చిన్నా పాల్గొన్నారు.
Updated Date - 2021-08-18T06:27:30+05:30 IST