ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గండ్లు పూడ్చివేత పనుల్లో భారీగా అవినీతి

ABN, First Publish Date - 2021-08-04T05:17:43+05:30

గొల్లప్రోలు, ఆగస్టు 3: ఏలేరు, పీబీసీ కాలువలకు పడిన గండ్లు పూడ్చివేత పనుల్లో భారీ అవినీతి జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పట్టణంలోని టీడీపీ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు కార్యాలయం లో మంగళవారం జరిగిన సమావేశంలో వర్మ మాట్లాడుతూ వైసీపీ నేతలు, ఇరిగేషన్‌ అధికారులు కుమ్మక్కై పనులు సరి గా చేయలేదన్నారు. మట్టి, గ్రావెల్‌తో పూడ్చాల్సిన గండ్లును ఇ

గొల్లప్రోలు సమావేశంలో మాట్లాడుతున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

గొల్లప్రోలు, ఆగస్టు 3: ఏలేరు, పీబీసీ కాలువలకు పడిన గండ్లు పూడ్చివేత పనుల్లో భారీ అవినీతి జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పట్టణంలోని టీడీపీ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు కార్యాలయం లో మంగళవారం జరిగిన సమావేశంలో వర్మ మాట్లాడుతూ వైసీపీ నేతలు, ఇరిగేషన్‌ అధికారులు కుమ్మక్కై పనులు సరి గా చేయలేదన్నారు. మట్టి, గ్రావెల్‌తో పూడ్చాల్సిన గండ్లును ఇసుకతో పూడ్చటంతో కొద్దిపాటి వర్షాలకే అవి జారిపోతున్నాయన్నారు. ఏలేరు, పీబీసీ పరిధిలో గండ్లు అసంపూర్తిగా పూడ్చడం వల్ల సుమారు 10వేల ఎకరాల్లో పొలాలకు ముంపు ప్రమాదం పొంచిఉందన్నారు. ఏమాత్రం అధిక వర్షా లు వచ్చినా గండ్లు అన్నీ కొట్టుకుపోతాయని తెలిపారు. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో జరిగిన పనులపై సమగ్ర విచారణ జరిపించాలని, మళ్లీ పటిష్టంగా పూడ్చాలని వర్మ డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు గుండ్ర సుబ్బారావు, ఉలవకాయల దేవేంద్రుడు, నగర  పంచాయతీ మాజీ చైర్మన్‌ శీరం మాణిక్యం, మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌, బస్సా సత్యనారాయణ, గండే నాగేశ్వరరావు, పడాల రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T05:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising