ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బొమ్మ’కు చాన్స్‌

ABN, First Publish Date - 2021-07-28T06:40:03+05:30

జిల్లాలో మళ్లీ సినిమా సందడి మొదలు కానుంది. ఈనెల 30వ తేదీ నుంచి ఽథియేటర్లను తెరుచుకునేందుకు 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకునేందుకు అవకాశమివ్వడంతో ప్రేక్షకుల్లో మళ్లీ ఆనందం మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

30వ తేదీ నుంచి సినిమా హాళ్లు తెరుచుకోవచ్చు

50 శాతం ఆక్యుపెన్సీతో తెరిచేందుకు అవకాశం

పూర్తి స్థాయిలో తెరవడం కష్టమంటున్న యాజమాన్యాలు

కల్చరల్‌(కాకినాడ), జూలై 27: జిల్లాలో మళ్లీ సినిమా సందడి మొదలు కానుంది. ఈనెల 30వ తేదీ నుంచి ఽథియేటర్లను తెరుచుకునేందుకు 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకునేందుకు అవకాశమివ్వడంతో ప్రేక్షకుల్లో మళ్లీ ఆనందం మొదలైంది. అయితే ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలతో ఽథియే టర్లు తెరుచుకునే అవకాశం కష్టమంటున్నారు యజమానులు. జిల్లా వ్యాప్తంగా 140 ఽథియేటర్లు ఉండగా, ఇందులో 30వ తేదీన పది థియేటర్లే తెరిచే అవకాశం ఉంది. మిగిలిన వారు ప్రభుత్వ నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వంతో జరిగిన సంప్రదింపుల్లో ఎగ్జిబిటర్లు పలు సమస్యలను నివేదించారు. జీవో నెం 35లో నిర్దేశించిన విధంగా సీ సెంటర్లలో ప్రదర్శనలు చేయడం కష్టతరంతో కూడుకున్నదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏ, బీ సెంటర్ల యాజమాన్యాలు కూడా సీ సెంటర్ల యాజమాన్యాలకు మద్దతు పలకుతుండడం విశేషం. దీంతో థియేటర్లు తెరిస్తే అందరం కలిసే తెరవాలని, లేదంటే మూసివేసే ఉంచాలనే నిర్ణయంతో ఉన్నారు. టిక్కెట్ల ధరలకు సంబంధించిన ఈ సమస్య మొత్తానికి జఠిలంగా మారింది. ఇక 30న విడుదలవుతున్న తిమ్మరుసు, ఇష్క్‌ సిని మాలు చిన్న సినిమాలు కావడంతోపాటు రోజుకు 3 ఆటల ప్రదర్శనను  50శాతం ఆక్యుపెన్సీతో వేస్తే నిర్వహణ ఖర్చులు కూడా రావంటున్నారు.  సినిమా హాళ్లు తెరిచేందుకు మరో రెండ్రోజులు గడువు ఉన్న నేపథ్యంలో కోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూద్దామని, లేదంటే థియేటర్లు తెరిచే పరిస్థితి లేదనే వాదనా వినిపిస్తోంది.



Updated Date - 2021-07-28T06:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising