ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో తిరోగమనంలోకి రాష్ట్రం

ABN, First Publish Date - 2021-12-06T05:04:42+05:30

పెద్దాపురం, డిసెంబరు 5: వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా తిరోగమనంలోకి పోయిందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండల పరిధిలోని తాటిపర్తి గ్రామంలో ఆదివారం నిర్వహించిన గౌరవ సభ కార్యక్రమంలో రాజప్ప మాట్లాడుతూ టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ది తప్పితే

తాటిపర్తిలో గౌరవ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చినరాజప్ప, సుంకర పావని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప 

పెద్దాపురం, డిసెంబరు 5: వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా తిరోగమనంలోకి పోయిందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండల పరిధిలోని తాటిపర్తి గ్రామంలో ఆదివారం నిర్వహించిన గౌరవ సభ కార్యక్రమంలో రాజప్ప మాట్లాడుతూ టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ది తప్పితే గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఓటీఎస్‌ పేరుతో ప్రజల నుంచి వేలాది రూపాయలు బలవంతపు వసూళ్లకు పాల్పడడం దుర్మార్గమన్నారు. కాకినాడ పార్లమెంటరీ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుంకర పావని మాట్లాడుతూ జగన్‌ ముఠా దుశ్శాశన పర్వం, బూతులపై తగిన గుణపాఠం చెప్పాలన్నారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును సీఎంగా చేసి సత్తాచాటాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి), గుడా మాజీ డైరెక్టర్‌ ఎలిశెట్టి నాని, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనే రామారావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పేకేటి వెంకటేశ్వరరావు (దొరబాబు), మాజీ ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఆచంట రాజబాబు, సింగన అరవింద కుమార్‌, చాగంటి గోపాలకృష్ణ మేడిది శ్రీనివాస్‌, దేవళ్ల సతీష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-06T05:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising