ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీనియర్‌ కౌన్సిలర్లకు గౌరవమేది?

ABN, First Publish Date - 2021-10-30T05:27:17+05:30

పెద్దాపురం, అక్టోబరు 29: మున్సిపల్‌ కౌన్సిల్లో సీనియర్‌ కౌన్సిలర్లకు గౌరవం లేదు, వారికి కనీసం ఇచ్చే మర్యాద కూడా సరిగా ఉండడం లేదని కౌన్సిలర్‌ విజ్జపు రాజశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీమంగతా

సమావేశంలో ప్రశ్నిస్తున్న రాజశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌన్సిలర్‌ విజ్జపు రాజశేఖర్‌  
వాడివేడిగా పెద్దాపురం కౌన్సిల్‌ సమావేశం
పెద్దాపురం, అక్టోబరు 29:
మున్సిపల్‌ కౌన్సిల్లో సీనియర్‌ కౌన్సిలర్లకు గౌరవం లేదు, వారికి కనీసం ఇచ్చే మర్యాద కూడా సరిగా ఉండడం లేదని కౌన్సిలర్‌ విజ్జపు రాజశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీమంగతాయారు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. కౌన్సిలర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ కమిషనర్‌ తమతో సంప్రదించకుండానే ఆయన పనులు చేసుకుపోతున్నారని, ఇది ఎంతమాత్రం సముచితంకాదన్నారు. దీంతో సమావేశం వాడివేడిగా ప్రారంభమైంది. అనంతరం మున్సిపల్‌ ప్యానల్‌ కమిటీలను వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌ చదివి వినిపించగా దీనిపై కౌన్సిలర్‌ రాజశేఖర్‌ అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో సీనియర్‌ అయిన తనకు చాలా అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వైస్‌ చైర్మన్‌ సాయిప్రసాద్‌ కల్పించుకుని కౌన్సిల్లో అంతా సమానమే అని, ఎవరినీ అవమానించే విధంగా వ్యవహరించలేదన్నారు. పట్టణంలో సమస్యల పరిష్కారానికి సమష్టిగా పనిచేయాలన్నారు. కౌన్సిలర్‌ త్సలికి సత్యభాస్కర్రావు మాట్లాడుతూ సంతమార్కెట్‌ స్థలాన్ని మున్సిపాలిటీ ఆర్టీసీకి అప్పగించిందని, కానీ ఆర్టీసీ సంస్థ కాంప్లెక్స్‌ స్థలాన్ని మున్సిపాలిటీకి ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. అనంతరం పలువురు వార్డుల్లో సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో కమిషనర్‌ సురేంద్ర, శానిటరీ ఇనస్పెక్టర్‌ దావీదురాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T05:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising