పెద్దాపురం డివిజన్‌లో 30 వేల గృహాల నిర్మాణం
ABN, First Publish Date - 2021-01-19T05:29:30+05:30
ప్రత్తిపాడు, జనవరి 18: పెద్దాపురం డివిజన్‌లో ఫేజ్1లో భాగంగా 30 వేల గృహాలు నిర్మించనున్నట్టు పెద్దాపురం డివిజనల్ డెవల్‌పమెంట్ అధికారి ప్రసాద్ తెలి పారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 8451 గృహాల నిర్మాణానికి తీసుకునే చర్యలను ఆయన వివరించారు. పంచా
డీఎల్‌డీవో ప్రసాద్
ప్రత్తిపాడు, జనవరి 18: పెద్దాపురం డివిజన్‌లో ఫేజ్1లో భాగంగా 30 వేల గృహాలు నిర్మించనున్నట్టు పెద్దాపురం డివిజనల్ డెవల్‌పమెంట్ అధికారి ప్రసాద్ తెలి పారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 8451 గృహాల నిర్మాణానికి తీసుకునే చర్యలను ఆయన వివరించారు. పంచాయతీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు సెక్రటరీలకు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలుపై 2 రోజులపాటు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే శిక్షణా తరగతులకు ఎంపీడీవో శ్రీలలిత ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎల్‌ఈవో ప్రసాద్, హౌసింగ్ ఈఈ సుధాకర్ పట్నాయక్, డీఈ ఎస్‌వీ సురే్‌షబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో నూతనంగా ఫేజ్-1లో భాగంగా నిర్మించే గృహా నిర్మాణాలపై సిబ్బంది పూర్తి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఒక ఇంటి నిర్మాణంపై తీసుకోవాల్సిన అంశాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు సిబ్బందికి వివరించారు. సమావేశంలో ఏలేశ్వరం ఎంపీడీవో రత్నకుమారి, ప్రత్తిపాడు, రౌతులపూడి హౌసింగ్ ఏఈ అత్తిలి ప్రసాద్, శంఖవరం, ఏలేశ్వరం హౌసింగ్ ఏఈలు వై.విరమణ, డి.సువర్ణరాజు, ఆయా మండలాల 365 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-19T05:29:30+05:30 IST