ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ విగ్రహం పక్కన ఫ్లెక్సీ ఏర్పాటుతో వివాదం

ABN, First Publish Date - 2021-07-27T06:28:54+05:30

రాజోలు సంత మార్కెట్‌ వద్దనున్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్ర హం పక్కన ఫ్లెక్సీ ఏర్పాటుతో వివాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజోలు, జూలై 26: రాజోలు సంత మార్కెట్‌ వద్దనున్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్ర హం పక్కన ఫ్లెక్సీ ఏర్పాటుతో వివాదం నెలకొంది. మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజోలుకు చెం దిన చెల్లుబోయిన రాంబాబు ఎన్టీఆర్‌ విగ్రహం పక్కన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో వివాదం తలెత్తింది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయ కులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకుని ఫ్లెక్సీని తొలగించాలని నిరసన తెలిపారు. ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహం ఎదుట టీడీపీ నాయ కులు ఫ్లెక్సీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న సమయంలో రాజోలు ఎస్‌ఐ బి.కృష్ణమాచారి  సిబ్బందితో అక్కడకు చేరు కున్నారు. గొల్లపల్లి, టీడీపీ నాయకులతో ఎస్‌ఐ చర్చలు జరి పారు. రెండు రోజుల్లో ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తామని ఎస్‌ఐ కృష్ణమాచారికి పంచాయతీ సెక్రటరీ బి.వెంకటరమణ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కసుకుర్తి త్రినాథస్వామి, చాగంటి స్వామి, బేతినీడి శ్రీను, కాండ్రేగుల రాము, కడలి నాగేశ్వరరావు, ఎం.లక్ష్మి, కొత్తపల్లి విజయలక్ష్మి, మెరుగుమువ్వల సత్య వరప్రసాద్‌, పామర్తి రమణ, అడబాల విజయ్‌, పితాని  సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T06:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising