ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచేశారు!

ABN, First Publish Date - 2021-07-18T07:07:48+05:30

రెండేళ్లుగా నాన్చినాన్చి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎట్టకేలకు నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం

జిల్లాకు అయిదు రాష్ట్ర, 12 జిల్లా స్థాయి కార్పొరేషన్‌, సంస్థల చైర్మన్‌ పదవులు

గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి దొరబాబు

ద్వారంపూడి తండ్రి భాస్కరరెడ్డికి పౌర సరఫరాల సంస్థ చైౖర్మన్‌ పదవి

మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి కోడలు శైలజకు దృశ్య కళా అకాడమీ

కాకినాడకు చెందిన వైద్యురాలు ప్రభావతికి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ 

గ్రామీణ నీటి సరఫరా సలహాదారుడిగా రాజోలు వైసీపీ నేత బొంతు

జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో మరో 12 మందికి చైర్మన్‌లుగా పట్టం

పదవుల పంపకంలో గాడ్‌ఫాదర్‌ ఉన్న వాళ్లకే అధిష్ఠానం ప్రాధాన్యం

పోస్టులన్నీ ముఖ్య నేతల సన్నిహితులకే.. పదవులు దక్కక క్యాడర్‌లో అసంతృప్తి

మంత్రి కన్నబాబు వర్గానికి పూర్తిగా మొండిచేయి.. పట్టు నెగ్గించుకున్న ద్వారంపూడి 

 
(కాకినాడ-ఆంధ్రజ్యోతి):
 రెండేళ్లుగా నాన్చినాన్చి ఎట్టకేలకు ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల పందేరం చేపట్టింది. పార్టీ నేతలు, అనుచరులు, సానుభూతిపరులకు వివిధ కార్పొరేషన్ల చైౖర్మన్‌ పోస్టులను కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. జిల్లాకు అయిదు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, మరో 12 మందికి జిల్లా స్థాయిలో వివిధ కార్పొ రేషన్లు, సంస్థల చైౖర్మన్‌ పదవులు పంచింది. అయితే వీరిలో అత్యధికంగా కీలక నేతల సన్నిహితులు, అనుచరులే ఉండడంతో సగటు క్యాడర్‌లో అసంతృప్తి రాజుకుంటోంది. ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పారంటూ వారంతా మండిపడుతున్నాయి. గాడ్‌ఫాదర్‌లున్న వారికి పట్టం కట్టి పార్టీ కోసం శ్రమించిన వారిని వదిలేయడంపై భగ్గుమంటున్నారు. అటు మంత్రి విశ్వరూప్‌, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎక్కువ పోస్టులు తన్నుకుపోగా, మంత్రి కన్నబాబు వర్గానికి పూర్తిగా మొండిచేయే ఎదురైంది. 


పెద్దాపురం వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి దొరబాబుకు రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌ పదవి వరించింది. మొన్న ఎన్నికల్లో పెద్దాపురం నుంచి ఈయన అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో భారీగా సొంత ఖర్చుతో సామర్లకోట, పెద్దాపురం మున్సిపాల్టీలు పార్టీ ఖాతాలో పడేలా చేశారు. తీరా తన తల్లిని మున్సిపల్‌ చైర్మన్‌ సీటులో కూర్చోబెట్టే సమయంలో అధిష్ఠానం చెక్‌ పెట్టింది. నిరాశలో ఉన్న ఈయనకు అధిష్ఠానం పదవితో సంతృప్తి పరిచింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి పౌర సరఫరాల సంస్థ చైౖర్మన్‌ పదవి దక్కింది. ఈయన ఎన్నో ఏళ్లుగా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ అధినేత జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం, సామాజిక పరంగా బలం ఉండడంతో ఈ పదవి వరించింది.


అమలాపురం మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయికి ఎమ్మెల్సీ హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన కోడలు శైలజకు దృశ్య కళా అకాడమీ చైర్మన్‌గా పదవి కట్టబెట్టారు. కాకినాడకు చెందిన డాక్టర్‌ ప్రభావతికి సైన్స్‌అండ్‌ టెక్నాలజీ అకాడమీ చైర్మన్‌ పదవి వచ్చింది. ఇప్పుడీ పోస్టు వైసీపీలో అగ్గి రాజేస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈమెకు బీసీ కోటా కింద పదవి ఎలా ఇస్తారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. పైగా ఈమెకు పార్టీతో కూడా సంబంధం లేదు. కాకపోతే ద్వారంపూడి ఒత్తిడితో పదవి దక్కించుకున్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మొన్న ఎన్నికల్లో రాజోలు నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వర్‌కు గ్రామీ ణ నీటి సరఫరా విభాగం సలహాదారుడుగా పదవి కట్టబెట్టారు. అనపర్తికి చెందిన కాయల వెంకటరెడ్డికి విజయనగరం జిల్లా నుంచి ఏపీ మారిటైం బోర్డు చైౖర్మన్‌ పదవి లభించింది. జగన్‌ పాదయాత్ర ముగిసిన ఇచ్ఛాపురంలో ఈయన రూ.2 కోట్లతో సొంతంగా పాదయాత్ర గుర్తుగా స్తూపం నిర్మించారు.


ఇక జిల్లా స్థాయిలో వివిధ విభాగాలు, సంస్థలకు చైౖర్మన్‌లుగా మరో 12 మందికి పదవులు దక్కాయి. రాజమహేంద్రవరం స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా చందన నాగేశ్వర్‌కు పదవి కట్టబెట్టారు. ఈయన వస్త్రవ్యాపారి చందన రమేష్‌ తనయుడు. రాజమహేంద్రవరంలో గతంలో మూడో వార్డు కార్పొరేటర్‌గా పనిచేసి మేయర్‌ స్థానం ఆశించి భంగపడ్డ షర్మిలారెడ్డికి రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ పదవి లభించింది. ద్వారంపూడి అనుచరుడు, వైసీపీ రాష్ట్ర బీసీ సెల్‌ నేత అల్లి రాజబాబుకు కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌  చైర్మన్‌ పదవి దక్కింది. హిత కారిణీ సమాజం చైర్మన్‌గా కాశీ మణికుమారి, తొండంగి మండలం నుంచి వైసీపీ నుంచి ఎంపీటీసీగా పోటీచేసిన శైలజకు ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు చైౖర్మన్‌గా పదవులు వరించాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైౖర్మన్‌గా దూలం పద్మ నియమితులయ్యారు.


కాకినాడ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికి కాకినాడ నగర అభివృద్ధి సంస్థ చైౖర్మన్‌గా, రావులపాలేనికి చెందిన వైసీపీ నేత ప్రసన్నకుమార్‌ భార్య మణికుమారికి డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవి లభించింది. రాజమహేంద్రవరం అర్బన్‌బ్యాంకు చైర్మన్‌గా గిరజాల రామకృష్ణకు పదవి ఇచ్చారు. ముమ్మిడివరం వైసీపీ నేత చక్రపాణిరావుకు తూర్పు డెల్టా బోర్డు, అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌ అనుచరుడు వెంకటేశ్వర్‌కు మధ్య డెల్టా బోర్డు చైర్మన్లుగా పదవులు లభించాయి. గతంలో రాజమహేంద్ర వరం రూరల్‌ వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన ఆకుల వీర్రాజుకు డీసీసీబీ చైర్మన్‌ పదవి వచ్చింది. నామినేటెడ్‌ పదవుల పంపకంలో సమతూకం పాటించినట్టు వైసీపీ చెబుతున్నా గాడ్‌ఫాదర్‌ ఉన్నవారికి మాత్రమే పదవులు వరించాయిని క్యాడర్‌ గుర్రుమంటున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేస్తే తమను కాకుండా వేరొకరిని అందలం ఎక్కించారని మండిపడుతున్నారు.


కాకినాడ రూరల్‌లో మంత్రి కన్నబాబుపై అనుచరులు రుసరుసలాడుతున్నారు. నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా తెచ్చుకోలేపోయారని మండిపడుతున్నారు. పక్కనే ఉన్న ద్వారంపూడి పోస్టులన్నీ తన్నుకుపోయి అధిష్ఠానం వద్ద పట్టు నిరూపించుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ప్రకటించిన పోస్టుల్లో శెట్టిబలిజ సామాజికవర్గానికి అన్యాయం జరిగిందని ఆ సామాజిక వర్గం సంక్షేమ నేత రామారావు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో పదవుల పంపకంలో ప్రాధాన్యం పక్కనపెట్టడంతో పార్టీ సీనియర్‌ నేతలు, ఇతర క్యాడర్‌ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కాగా జిల్లా కోటా కింద 17 పదవులు వచ్చాయి. వెంకటరెడ్డి పదవి కూడా కలిపితే 18 అవుతాయి. అందులో రెడ్లకు మూడు, కాపులకు 6, శెట్టిబలిజకు 3, యాదవకు 1, దేవాంగకు 1, మత్స్యకారలకు 1, మాలకు 3 పదవులు లభించాయి.

Updated Date - 2021-07-18T07:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising