ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైతికత గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు: ఎంపీ బోస్‌

ABN, First Publish Date - 2021-10-21T05:48:04+05:30

ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామచంద్రపురం, అక్టోబరు 20: ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ ఖండించారు. బుధవరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్ర బాబు అధికారంలో ఉన్నప్పుడు తన ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష సభ్యులపై దు ర్భాషలాడించి నైతిక విలువలు పతనం కావడానికి ఆజ్యం పోశారన్నారు.

ముఖ్యమంత్రిపై ధూషణ తగదు: ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

కొత్తపేట: సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన ధూ షణలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ కార్యక్రమాలకు ప్రజాస్పందన లేదన్నారు. ఏఎంసీ చైర్మన్‌ గొల్లపల్లి డేవిడ్‌రాజు, జడ్పీటీసీ గూడపాటి రమాదేవి, ఎంపీపీమార్గాన గంగాధర్‌, వీరభద్రరావు పాల్గొన్నారు.

పట్టాభిని అరెస్ట్‌ చేయాలి : ఎమ్మెల్యే చిట్టిబాబు 

పి.గన్నవరం: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్ట్‌ చేయాలని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు డిమాండ్‌ చేశారు. పి.గన్నవరం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మీ పాల్గొన్నారు.

పట్టాభి వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ప్రోత్సాహం: ఎమ్మెల్సీ తోట 

మండపేట: పట్టాభిచేసిన పరుష వ్యాఖ్యల వెనుక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహం ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు.బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టాభి వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. 

పట్టాభిని అరెస్ట్‌ చేయాలి: ఎమ్మెల్యే రాపాక 

మలికిపురం: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు మలికిపురం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపి తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

అంతర్వేది: సఖినేటిపల్లి మండలంలో వైసీపీ నాయకులు బుధవారం దిష్టిబొమ్మను దహనంచేసి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  

కాట్రేనికోన:  టీడీపీ నాయకుడు పట్టాభిరామ్‌ సీఎం జగన్‌ను అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ బుధవారం కాట్రేనికోనలో ఆందోళన చేపట్టింది. పట్టాభిరా మ్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ముమ్మిడివరం:  టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ముమ్మిడివరంలో వైసీపీ నాయకులు 216 జాతీయ రహదారిపై భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 

మామిడికుదురు: పట్టాభి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ నాయకులు మామిడికుదురులోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. 

Updated Date - 2021-10-21T05:48:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising