ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వశిష్ఠ నదిపై వారధి!

ABN, First Publish Date - 2021-11-15T06:58:12+05:30

సఖినేటిపల్లి-నరసాపురం మధ్య వంతెన నిర్మించాలన్న ప్రతిపాదన దశాబ్దాలుగా పెండింగులో ఉంది. తొలుత ఇక్కడ శంకుస్థాపన జరిగినప్పటికీ అనివార్య పరిస్థితుల్లో దిండి-చించినాడ మధ్య వంతెన నిర్మించారు. దాంతో సఖినేటిపల్లి వారధి నిర్మాణ ప్రతిపాదనకు గ్రహణం పట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సఖినేటిపల్లి-నరసాపురం మధ్య గోదావరిపై రూ.450 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు
  • కత్తిపూడి-పామర్రు జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మాణం
  • భూ సేకరణకు రూ.65 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం

వశిష్ఠ గోదావరి నదిపై మరో వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దశాబ్దాలుగా పడవలు, పంటులపై రవాణా చేస్తున్న ప్రయాణికుల వెతలను తీర్చే లక్ష్యంతో గోదావరిపై సఖినేటిపల్లి- నరసాపురంలను కలుపుతూ వారధి నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు సుమారు రూ.450 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే  టెండర్లు కూడా పిలిచేందుకు ఏర్పాట్లు చేపట్టింది.


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

సఖినేటిపల్లి-నరసాపురం మధ్య వంతెన నిర్మించాలన్న ప్రతిపాదన దశాబ్దాలుగా పెండింగులో ఉంది. తొలుత ఇక్కడ శంకుస్థాపన జరిగినప్పటికీ అనివార్య పరిస్థితుల్లో దిండి-చించినాడ మధ్య వంతెన నిర్మించారు. దాంతో సఖినేటిపల్లి వారధి నిర్మాణ ప్రతిపాదనకు గ్రహణం పట్టింది. నిత్యం వేల మంది ప్రయాణికులు పంట్లపై ప్రయాణించడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల యంత్రాం గానికి కోట్ల రూపాయల ఆదాయం రేవు పాట ద్వారా సమకూరుతోంది. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మరోసారి ఈ వారధి నిర్మాణం వెలుగులోకి వచ్చినా ఆచరణ సాధ్యం కాలేదు. వశిష్ఠ నదిపై సఖినేటిపల్లి-నరసాపురం మధ్య రూ.450 కోట్ల అంచనాతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. గోదావరి జిల్లాల సరిహద్దుల్లో భూ సేకరణ చేపట్టేందుకు రూ.65కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. డీపీఆర్‌ పూర్తయిన వెంటనే నిర్మాణ వ్యయం ఎంతో నిర్ధారణ చేస్తారు. ప్రస్తుతం డీపీఆర్‌ పూర్తి చేసే పనుల్లో అధికారులు ఉన్నారు. రాజోలు, నరసాపురం నియోజకవర్గాల పరిధిలో రాజుల్లంక మధ్య వారధి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజుల్లంక నుంచి కత్తిపూడి-పామర్రు రహదారి నిర్మాణంలో భాగంగా నరసాపురం బైపాస్‌ నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇటీవల ఆ శాఖ మంత్రి నితిన గడ్కరీని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. దీంతో 216 జాతీయ రహదారిలో కత్తిపూడి నుంచి పామర్రు వెళ్లే మార్గంలో నరసాపురానికి బైపాస్‌ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదన కోసం కేంద్రం కన్సల్టెన్సీని కూడా నియమించింది. డీపీఆర్‌ పూర్తి కాగానే  అటు వశిష్ఠ నదిపై వంతెన, ఇటు నరసాపురం రహదారి నిర్మాణాలకు మార్గం సుగమం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. గత ప్రభుత్వాల్లో మాదిరిగా ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితం కాకుండా టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. 

Updated Date - 2021-11-15T06:58:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising