ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నన్నయ’లో ఫిల్మ్‌కోర్సు ఏర్పాటు: దర్శకుడు శంకర్‌

ABN, First Publish Date - 2021-01-27T05:53:04+05:30

కళలకు పుట్టినిళ్లైన గోదావరి జిల్లాల్లోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా నన్నయ విశ్వవిద్యాలయంలో ఫిల్మ్‌ కోర్సును ఏర్పాటు చేస్తామని ప్రముఖ సినీ దర్శకుడు ఎన.శంకర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దివానచెరువు, జనవరి 26: కళలకు పుట్టినిళ్లైన గోదావరి జిల్లాల్లోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా నన్నయ విశ్వవిద్యాలయంలో ఫిల్మ్‌ కోర్సును ఏర్పాటు చేస్తామని ప్రముఖ సినీ దర్శకుడు ఎన.శంకర్‌ అన్నారు. ఆయన విశ్వవిద్యాలయాన్ని మంగళవారం సందర్శించి వీసీ జగన్నాథరావుతో పలు అంశాలపై చర్చించారు. వీసీ మాట్లాడుతూ నన్నయ వర్శిటీలో ఫిల్మ్‌కోర్సును ఏర్పాటు చేస్తే గోదా వరి జిల్లాల వాసులకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. స్థానిక ప్రతిభను ప్రోత్స హించే విధంగా తక్కువ ఫీజులతో ఫిల్మ్‌స్టడీస్‌, ఫైన ఆర్ట్స్‌ వంటి కోర్సులను ఏర్పాటు చేయవచ్చన్నారు. విశ్వవిద్యాలయ గీతానికి చిత్రానువాదం చేయాలని వారిని కోరారు.  విశ్వవిద్యాలయంలో ఫిల్మ్‌కోర్సును ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తామని శంకర్‌ చెప్పారు. నటన, దర్శకత్వం, ఫొటోగ్రఫీ, లలితకళలు వంటి శిక్షణను అందించే చక్కని వేదికగా నన్నయ విశ్వవిద్యా లయం ఉండబోతోందన్నారు. ఈ సందర్భంగా శంకర్‌ను వీసీ సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో లీగల్‌అధికారి నందెపు నాగేంద్రరావు, పీఆర్‌వోపీ ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:53:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising