ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరగాలి

ABN, First Publish Date - 2021-09-19T04:57:29+05:30

సామర్లకోట, సెప్టెంబరు 18: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు అధికారులకు సహకరించాలని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు విజ్ఞప్తి చేశారు. సామర్లకోట ఈటీసీ, టీటీడీసీ ఆవరణల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

సామర్లకోటలో కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

సామర్లకోట, సెప్టెంబరు 18: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు అధికారులకు సహకరించాలని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు విజ్ఞప్తి చేశారు. సామర్లకోట ఈటీసీ, టీటీడీసీ ఆవరణలలో కౌటింగ్‌ కేంద్రాలను శనివారం జేసీ కీర్తి చేకూరి, పెద్దాపురం ఆర్డీవో ఎస్‌.మల్లిబాబుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఆదివారం కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని.. సెక్షన్‌-144, సీఆర్‌పీసీ, 30 పోలీస్‌ యాక్ట్‌, కొవిడ్‌-19 నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఏ ప్రదేశంలోనైనా నలుగురు కంటే ఎక్కువమంది గుమిగూడి ఉండరాదన్నారు. కౌంటింగ్‌కు కేవలం గుర్తింపు కలిగిన అనుమతిపత్రాలు కలిగినవా రిని మాత్రమే అనుమతిస్తామని ఆయన తెలిపారు. ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు చేయరాదన్నారు. బాణసంచా కాల్చరాదన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. డీజే సౌండ్‌ సిస్టమ్‌లు పూర్తిగా నిషేధించామన్నారు. ఇతర రాజకీయ పార్టీలపై కవ్వింపు చర్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలని జేసీ కీర్తి ఆదేశించారు. సామర్లకోటలో పెద్దాపురం డివిజన్‌కు సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాల సమగ్ర సమాచారాన్ని ఆర్డీవో ఎ స్పీ, జేసీకి వివరించారు. స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ మొగలి వెంకటేశ్వరరావు, పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సీఐ జయకుమార్‌, సామర్లకోట, పెద్దాపురం ఎస్‌ఐలు అభిమన్యు, మురళీమోహన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-19T04:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising