ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నియంత్రణలో భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2021-05-15T05:45:23+05:30

జీజీహెచ్‌ (కాకినాడ), మే 14: కొవిడ్‌ రెండో దశ నియంత్రణలో వ్యాపార, వాణిజ్య సంస్థలు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందించాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడ జీజీహెచ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో

ట్రయాజ్‌ సెంటర్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను పరిశీలిస్తున్న మంత్రి వేణు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ 

జీజీహెచ్‌లో 30 కిలో లీటర్ల ఆక్సిజన్‌ ట్యాంకు, 

ట్రయాజ్‌ సెంటర్లో 24 పడకలు ప్రారంభం

జీజీహెచ్‌ (కాకినాడ), మే 14: కొవిడ్‌ రెండో దశ నియంత్రణలో వ్యాపార, వాణిజ్య సంస్థలు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందించాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడ జీజీహెచ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన 10 కిలో లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్‌ ట్యాంకు, ఈఎన్‌టీ విభాగం వద్ద ఆధునికీకరించిన ట్రయాజ్‌ సెంటర్‌లో 24 పడకలను కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీజీహెచ్‌లో ఎటువంటి ఆక్సిజన్‌ కొరత లేకుండా ఉండేందుకు ప్రస్తుతమున్న 20 కిలో లీటర్ల స్టోరేజ్‌ సామర్థ్యంతో ఉన్న ఆక్సిజన్‌ ట్యాంకుకి అదనంగా కొత్త ట్యాంకును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలోని ఈఎస్‌ఐ  ఆసుపత్రిలో ఉన్న వనరులను ఉపయోగించుకుని సోమవారం నాటికి 50 పడకలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా 50 శాతం పడకలు, రెమ్‌డిసివిర్‌ సక్రమ వినియోగం పట్ల తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్టు చెప్పారు. 104 కాల్‌ సెంటర్‌కు రాష్ట్రంలో ఎక్కడాలేని రీతిలో రోజుకి 1500 కాల్స్‌ వస్తున్నాయని, వీటి సక్రమ నిర్వహణకు మహిళా పోలీసులకు శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో శిక్షణా కలెక్టర్‌ గీతాంజలిశర్మ, జీజీహెచ్‌  నోడల్‌ అధికారి సూర్యప్రవీణ్‌చంద్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-15T05:45:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising