ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2,010 కిలోల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-04-21T05:48:49+05:30

ఒడిసా రాష్ట్రంలోని చిత్రకొండ నుంచి మారేడుమిల్లి మీదుగా అక్రమంగా రవాణా అవుతున్న రూ.40.20 లక్షలు విలువ చేసే 2,010 కిలోల గంజాయిని మారేడుమిల్లి పోలీసులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఐదుగురి అరెస్టు, పరారీలో ఇద్దరు

మారేడుమిల్లి, ఏప్రిల్‌ 20: ఒడిసా రాష్ట్రంలోని చిత్రకొండ నుంచి మారేడుమిల్లి మీదుగా అక్రమంగా రవాణా అవుతున్న రూ.40.20 లక్షలు విలువ చేసే 2,010 కిలోల గంజాయిని మారేడుమిల్లి పోలీసులు పట్టుకున్నారు. మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను రంపచోడవరం ఏఎస్పీ బిందుమాధవ్‌ వెల్లడించారు. చిత్రకొండ సమీపంలోని మజిపాకలు గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి 67 బస్తాల్లో నింపారు. మారేడుమిల్లి-రాజమహేంద్రవరం మీదుగా ఐషర్‌ వ్యానులో కూరగాయల బస్తాల మాటున హైదరాబాద్‌ తరలించేందుకు ప్రయత్నించారు. మారేడుమిల్లి సమీపంలో సీఐ రవికుమార్‌ ఆఽధ్వర్యంలో ఎస్‌ఐ రామకృష్ణ వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. ఒడిసా రాష్ట్రం చిత్రకొండ జిల్లా మజిపాకలుకు చెందిన, చిరుగూరు వెంకట్రావు, ఎలక కామయ్య, ముడా కాంతయ్య, హైదరాబాద్‌కు చెందిన సయ్యిద్‌ జాఫర్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంజాద్‌ హలీంను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయి స్వాఽధీనం చేసుకుని ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేశారు. కాగా చిత్రకొండకు చెందిన మద్దివాడ రాజయ్య, హైదరాబాద్‌కు చెందిన  సోపాన్‌రాజ్‌ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాలో ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని ఏఎస్పీ చెప్పారు.   

Updated Date - 2021-04-21T05:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising