ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేపరు మిల్లు పల్ప్‌ ట్యాంకులో పడి ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-05-21T06:19:56+05:30

మండలంలోని కానవరం సాయిరామ్‌ పేపరు మిల్లులో గురువారం విష వాయువు లీకై ఒక వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా వుంది. ఇంకో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మరొకరి పరిస్థితి విషమం 
  • కానవరంలో ఘటన

రాజానగరం, మే 20: మండలంలోని కానవరం సాయిరామ్‌ పేపరు మిల్లులో గురువారం విష వాయువు లీకై ఒక వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా వుంది. ఇంకో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. వివరాల ఇలా వున్నాయి... కానవరం గ్రామానికి చెందిన సంగిశెట్టి నాగు, నాగవరపు శ్రీను, సంగిశెట్టి వీరబాబు స్థానిక సాయిరాం పేపరు మిల్లులో పని చేస్తున్నారు. గురువారం మిల్లులోని ప్రొడక్షన యూనిట్‌ వద్ద పల్ప్‌ చెస్టులో ఫ్యాన రిపేరు చేసేందుకు నాగు (34) నిచ్చెన సహాయంతో ట్యాంకులోకి దిగాడు. ఆ సమయంలో ఆక్సిజన అందకపోవడంతో కళ్లు తిరిగి కిందపడిపోయాడు. దీనిని గమనించిన శ్రీను అనే మరో వ్యక్తి కూడా దిగి ఊపిరాడక పడిపోయాడు. వీరిని రక్షించేందుకు దిగిన వీరబాబు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. ముగ్గురినీ ట్యాంకులోంచి బయటకు తీసి హుటాహుటిన రాజమహేంద్రవ రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా నాగు మృతి చెందాడు. శ్రీను పరిస్థితి విషమంగా ఉండడంతో పాటుగా కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో జీఎస్‌ఎల్‌ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. వీరబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. రాజానగరం సీఐ ఎండీ సుభాష్‌, డీఎస్పీ రవికుమార్‌, ఎస్‌ఐలు శివనాగబాబు, సుమన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పది సంవత్సరాల క్రితం ఇదే మాదిరిగా ఫరిజెల్లిపేట గ్రామంలో విష వాయువు లీకై ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Updated Date - 2021-05-21T06:19:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising