ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KKD : వారిద్దరూ ప్రేమించుకున్నారు.. రిజిస్ట్రేషన్ పెళ్లికి ప్లాన్.. పెద్దలు ఎంటరవ్వడంతో.. సినిమా తరహాలో ఘటన

ABN, First Publish Date - 2021-08-28T06:53:09+05:30

శ్రీవివేక్‌, వాణిశైలజ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకునేందుకు...

కాకినాడలోని రిజిస్ట్రార్‌ కార్యాలయంవద్ద వధువుతో ఘర్షణ పడుతున్న కుటుంబీకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వధువు కుటుంబీకుల అడ్డుకునే ప్రయత్నం..
  • నిలువరించిన వరుడి స్నేహితులు 
  • కాకినాడ రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద సినిమా తరహా ఘటన

కాకినాడ క్రైం, ఆగస్టు 27: జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఓ ప్రేమజంట శుక్రవారం వివా హం చేసుకుంది. వధువు తరపు కుటుంబీకులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా వరుడి స్నేహితులు వారిని నిలువరించారు. దీంతో అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. కాకినాడ ద్వారకానగర్‌కు చెందిన కత్తుల శ్రీవివేక్‌, కరప మండలం నడకుదురుకు చెందిన గుల్లిపల్లి వాణిశైలజ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు కావడంతో వీరి వివాహానికి ఇరు కుటుంబాలవారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో శ్రీవివేక్‌, వాణిశైలజ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రిజిస్టర్‌ మ్యారేజ్‌కోసం నెలరోజుల కిందట రిజిస్ర్టార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. శుక్రవారానికి 30రోజుల గడువు ముగియడంతో వివాహం చేసుకోవడం కోసం వారు కాకినాడ రిజిస్ట్రారు కార్యాలయానికి స్నేహితులతో కలసి విచ్చేసి రిజిస్ట్రారు సమక్షంలో వివాహం చేసుకున్నారు.


వధువు తల్లిదండ్రులు అక్కడికి వచ్చి తమ కుమార్తెకు నచ్చచెప్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వారు ఆమెను వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నించారు. వరుడు వాగ్వాదానికి దిగాడు. అతడి స్నేహితుల సహకారంతో ఆమెను తరలించారు. తల్లిదండ్రుల ఎదుటే కారులో ఎక్కి అక్కడినుంచి వధూవరులు వెళ్లిపోయారు.

Updated Date - 2021-08-28T06:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising