ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమ అభివృద్ధి ప్రదాత జీఎంసీ బాలయోగి

ABN, First Publish Date - 2021-10-02T07:00:42+05:30

అమలాపురం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కోనసీమ ప్రజల ఆశీస్సులతో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినొందిన మహనీయుడు దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి అని పలువురు వక్తలు కొనియాడారు. కోన సీమ అభివృద్ధి ప్రదాతగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించు

అమలాపురంలో బాలయోగి విగ్రహానికి పూజలు చేస్తున్న హరీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలయోగి చారిటబుల్‌ ట్రస్టు పలు సేవా కార్యక్రమాలు

అమలాపురం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కోనసీమ ప్రజల ఆశీస్సులతో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినొందిన మహనీయుడు దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి అని పలువురు వక్తలు కొనియాడారు. కోన సీమ అభివృద్ధి ప్రదాతగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించు కున్నారన్నారు. బాలయోగి జయంతిని పురస్కరించుకుని అమలాపురం నల్లవంతెన దిగువన ఉన్న బాలయోగి ఘాట్‌లో ఆయన కుమారుడు, టీడీపీ పార్లమెంటు ఇన్‌చార్జి హరీష్‌మాధుర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వంద లాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి బాలయోగి విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీష్‌ మాధుర్‌ మాట్లాడుతూ తన తండ్రి బాలయోగి పేరిట చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటుచేసి విద్యార్థులకు ఉపకార వేతనాలతోపాటు మహిళల ఆరోగ్య సంరక్షణకై సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే లు ప్రముఖులు అయితాబత్తుల ఆనందరావు, చెల్లి వివేకానంద, అయ్యాజీ వేమా, ఇతర నేతలు జ్యోతుల నవీన్‌, ఆదిరెడ్డి అప్పారావులతోపాటు మెట్ల రమణబాబు, నామన రాంబాబు, డొక్కా నాథ్‌బాబు, జగడం సత్యనారాయణ, నాగిడి నాగేశ్వరరావు, చిక్కాల గణేష్‌, చెల్లి అశోక్‌, పెచ్చెట్టి చంద్ర మౌళి, దెందుకూరి సత్తిబాబురాజు, వడ్డి సుభాషిణి, మట్టా మహలక్ష్మి ప్రభాకర్‌, గంగుమళ్ల కాశీఅన్నపూర్ణ, చిల్లా పురుషోత్తం, వేగిరాజు వెంక ట్రాజు, పేరాబత్తుల రాజశేఖర్‌, మద్దాల సుబ్బారావు, దేశంశెట్టి లక్ష్మీనారా యణ, బొక్కా రుక్మిణి, మట్టపర్తి భారతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-02T07:00:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising