ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలింగ్‌, కౌంటింగ్‌ ముగిసే వరకు బ్రాందీ షాపులు, బార్లు మూసేయాలి

ABN, First Publish Date - 2021-03-06T05:53:59+05:30

జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికలను స్వేచ్ఛాయుతమైన, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ నెల 8వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి 10వ తేదీన పోలింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు, ఈ నెల 14వ తేదీ ఉదయం నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు బ్రాందీ షాపులు, బార్లు మూసివేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డి.మురళీధర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మార్చి 5: జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికలను స్వేచ్ఛాయుతమైన, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ నెల 8వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి 10వ తేదీన పోలింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు, ఈ నెల 14వ తేదీ ఉదయం నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు బ్రాందీ షాపులు, బార్లు మూసివేయాలని కలెక్టర్‌,   జిల్లా ఎన్నికల అధికారి డి.మురళీధర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం మునిసిపాలిటీలు, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీల పరిధిలోని బెవరేజెస్‌ కార్పొరేషన్‌ హోల్‌సేల్‌ డిపోలు, అన్ని డిస్టిలరీలు, బ్రూవరీలు, రిటైల్‌ లిక్కర్‌ అవుట్‌లెట్లు, 2బి-బార్లు, కల్లు దుకాణాలు, అన్ని రకాల ఇన్‌హౌస్‌ లైసెన్స్‌ దుకాణాలను మూసివేయాలన్నారు. ఏపీ ఎక్సైజ్‌ యాక్ట్‌-1968 సెక్షన్‌-20(3) ప్రకారం ఈ మూసివేత కాలానికి లైసెన్స్‌దారులకు ఏ విధమైన ఫీజు కాంపెన్సేషన్‌ వర్తించదని తెలిపారు. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని ఎక్సైజ్‌, పోలీసు, రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 


Updated Date - 2021-03-06T05:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising