ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమలో ఈదురుగాలులు.. భారీ వర్షం..

ABN, First Publish Date - 2021-06-23T06:08:41+05:30

కోనసీమలో మంగ ళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి పోయింది. తుఫాను తరహాలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం భీభత్సం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): కోనసీమలో మంగ ళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి పోయింది. తుఫాను తరహాలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం భీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి.  కొన్నిచోట్ల వడగళ్ల వాన కూడా కురిసింది.  అమలాపురం పట్టణంలో పలుచోట్ల చెట్లు కుప్ప కూలాయి. హోర్డింగులు, ఫ్లెక్సులు, గాలికి ఎగిరిపోయాయి. ముఖ్య కూడళ్లలో పోలీసులు ఏర్పాటుచేసిన ట్రాఫిక్‌ బోర్డులు చెల్లాచెదురుగా పడ్డాయి. పలుచోట్ల విద్యుత్‌ వైర్లు తెగి పడ డంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  పట్టణంలో ప్రధాన డ్రైయిన్ల వెంబడి సిల్టు తీయడంతో రోడ్ల వెంబడి దుర్గంధపూరిత పరిస్థితి నెలకొంది. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలో ఉన్న పెట్రోలు బంకు వద్ద, వన చర్లవారివీధి వద్ద వర్షపునీరు భారీగా నిలిచిపోయింది. బండా రులంకలో పలుచోట్ల నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రయా ణికులు ఇబ్బందులకు గురయ్యారు. అమలాపురం మండలం బండారులంకతో సహా పలుచోట్ల చిన్నచిన్న వడగళ్ల వాన కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారి బీభత్సం సృష్టించడంతో ప్రజలు ఆందోళన చెందారు. ముప్పై నిమిషాల వ్యవధిలోనే తిరిగి వాతావరణం మామూలు స్థితికి రావడంతో ప్రజలు ఉపశమనం పొందారు. కోనసీమలో పలుచోట్ల  భారీ వర్షం కురిసింది.


Updated Date - 2021-06-23T06:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising