ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమ అందాలు అదుర్స్‌

ABN, First Publish Date - 2021-10-18T05:58:34+05:30

సినీ రంగానికి వచ్చిన తరు వాత ఎన్నో ప్రాంతాలు తిరిగా.. ఎన్నెన్నో అద్భుత ప్రదేశాలను చూడగలిగా.. వాటిన్నింటినీ ఒక్క కోనసీమలోనే చూసే అదృష్టం కలిగింది.. కోనసీమలోని ప్రకృతి అందాలు పరవశింప చేస్తున్నాయి, ఆతిథ్యం అంటే ఏమిటో ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసిందని ప్రముఖ బెంగాళీ హీరోయిన్‌ గార్గి కుండు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగాళీ హీరోయిన్‌ గార్గి కుండు

అమలాపురం టౌన్‌, అక్టోబరు 17: సినీ రంగానికి వచ్చిన తరు వాత ఎన్నో ప్రాంతాలు తిరిగా.. ఎన్నెన్నో అద్భుత ప్రదేశాలను చూడగలిగా.. వాటిన్నింటినీ ఒక్క కోనసీమలోనే చూసే అదృష్టం కలిగింది.. కోనసీమలోని ప్రకృతి అందాలు పరవశింప చేస్తున్నాయి, ఆతిథ్యం అంటే ఏమిటో ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసిందని ప్రముఖ బెంగాళీ హీరోయిన్‌ గార్గి కుండు పేర్కొన్నారు. అనుకోని అతిథిగా ఆదివారం అమ లాపురం వచ్చిన ఆమె తన మనసులోని భావాలను వెల్లడించారు. 2018లో నందికర్‌ నట్‌గర్‌తో సినీరంగానికి పరిచయమ య్యారు. సామియానా, షే జే భోజ్‌నా చిత్రాలతో పాటు 2020లో నటించిన యాన్‌ వెస్మాన్‌ మేరిజాన్‌ తదితర చిత్రాలు మంచి పేరును  తీసుకువచ్చి సహజనటిగా గుర్తింపునిచ్చాయన్నారు. ఇప్పటికీ బెంగాళీ, హిందీ చిత్రాల్లో నటించా. త్వరలో రహస్యచిత్రం విడుదల కానుంది. ఇక తెలుగులో బాపు ప్రొడక్షన్స్‌లో నటించే అవకాశం దక్కింది. త్వరలోనే తెలుగు సినీ రంగానికి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నా. నటిగానే కాకుండా వెబ్‌సిరీస్‌, తాను నటించిన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం ఎంతో ఆనందంగా  ఉంది.  భవిష్యత్‌లో తెలుగు సినీరంగంలో మంచి నటిగా గుర్తింపు పొందాలని గార్గి కుండు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ చిత్ర దర్శకుడు, నిర్మాత వీస్‌వర్మ పాకలపాటితో కలసి ప్రమోషన్‌ వర్క్‌లో భాగంగా కోనసీమలో పర్యటించడం, ఈప్రాంత ప్రజల ఆతిథ్యం తాను ఎప్పటికీ మరువనని పేర్కొన్నారు. 



Updated Date - 2021-10-18T05:58:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising