ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలింగ్‌ సిబ్బంది కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ABN, First Publish Date - 2021-09-18T05:41:57+05:30

కాకినాడ సిటీ/భానుగుడి, సెప్టెంబరు 17: పోలింగ్‌ సిబ్బంది, కౌంటింగ్‌ ఏజెంట్లు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కాకినాడ ఆర్డీవో ఏజీ.చిన్నికృష్ణ సూచించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆదివారం చేపట్టనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు సంబంధించి నగరంలోని మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల, రంగరాయ వైద్య కళాశాలల్లోని కౌంటింగ్‌ కేంద్రాలలో ఏర్పాట్లను శుక్రవారం ఆర్డీవో పర్యవేక్షించారు. ఈ

కాకినాడలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ 

కాకినాడ సిటీ/భానుగుడి, సెప్టెంబరు 17: పోలింగ్‌ సిబ్బంది, కౌంటింగ్‌ ఏజెంట్లు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కాకినాడ ఆర్డీవో ఏజీ.చిన్నికృష్ణ సూచించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆదివారం చేపట్టనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు సంబంధించి నగరంలోని మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల, రంగరాయ వైద్య కళాశాలల్లోని కౌంటింగ్‌ కేంద్రాలలో ఏర్పాట్లను శుక్రవారం ఆర్డీవో  పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ డివిజన్‌లోని కాకినాడ రూరల్‌, కరప, పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాలకు సంబంఽధించి ఓట్ల లెక్కింపు మెహర్‌నగర్‌లోని మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో జరుగుతుందన్నారు. సామర్లకోట, తాళ్లరేవు, పెదపూడి మండలాలకు సంబంధించి పిఠాపురం రోడ్‌లోని రం గరాయ వైద్య కళాశాలలో ఏర్పాట్లు చేశామన్నారు. కమ్యూనికేషన్‌ సెంటర్‌, మీడియా సెంటర్‌ ఏర్పాట్లను ఆర్డీవో పరిశీలించి సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన బార్‌ కేడింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.  కాకినాడ లా అండ్‌ ఆర్డర్‌ డీఎస్పీ వి.భీమారావు, ట్రాఫిక్‌ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ, రూరల్‌ ఎంపీడీవో కె.నారాయణమూర్తి పాల్గొన్నారు. 

 


Updated Date - 2021-09-18T05:41:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising