ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప్పుటేరుపై అక్రమ కట్టడాలతో ముంపు: వనమాడి

ABN, First Publish Date - 2021-10-30T05:16:28+05:30

కాకినాడ సిటీ, అక్టోబరు 29: ఉప్పుటేరుపై అక్రమ కట్టడాల వల్ల కాకినాడ నగరానికి ఎన్నడూలేని విధంగా ముంపు సమస్య ఏర్పడుతుందని, మేడలైన్‌కు ప్రైవేటు పెట్టుబడితో బకింగ్‌ హోం కెనాల్‌పై రోప్‌ వే బ్రిడ్జి విషయమై హడావిడి నిర్ణయం తీసుకోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పార్టీ కార్పొరేటర్లతో సమావేశమై కౌన్సిల్‌ అజెండాలోని

కాకినాడ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కొండబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ సిటీ, అక్టోబరు 29: ఉప్పుటేరుపై అక్రమ కట్టడాల వల్ల కాకినాడ నగరానికి ఎన్నడూలేని విధంగా ముంపు సమస్య ఏర్పడుతుందని, మేడలైన్‌కు ప్రైవేటు పెట్టుబడితో బకింగ్‌ హోం కెనాల్‌పై రోప్‌ వే బ్రిడ్జి విషయమై హడావిడి నిర్ణయం తీసుకోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పార్టీ కార్పొరేటర్లతో సమావేశమై కౌన్సిల్‌ అజెండాలోని అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకుని ప్రజాభిప్రాయ సేకరణతో ముందుకు వెళ్లాలన్నారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్‌, కార్పొరేటర్లు కాలా సత్తిబాబు, పలివెల రవి, వనమాడి ఉమాశంకర్‌, తుమ్మల సునీత, మల్లిపూడి దీపిక, వొమ్మి బాలాజీ, గుజ్జు శ్రీదేవి, బంగారు సూర్యావతి, అంబటి క్రాంతి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T05:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising