ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సూచించిన సెంటర్లలో ఆధార్‌ అప్‌డేట్‌’

ABN, First Publish Date - 2021-09-04T05:28:48+05:30

కార్పొరేషన్‌ (కాకినాడ), సెప్టెంబరు 3: ఆధార్‌ అప్‌డేట్‌కు వలంటీర్లు సూచించిన సెంటర్లకు వెళ్లాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ సూచించారు. స్మార్ట్‌సిటీ కార్యాలయంలోని సమావేశ మందిరం లో బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆధార్‌ సెంటర్ల ఆపరేటర్లతో శుక్రవారం స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్పొరేషన్‌ (కాకినాడ), సెప్టెంబరు 3: ఆధార్‌ అప్‌డేట్‌కు వలంటీర్లు సూచించిన సెంటర్లకు వెళ్లాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ సూచించారు. స్మార్ట్‌సిటీ కార్యాలయంలోని సమావేశ మందిరం లో బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆధార్‌ సెంటర్ల ఆపరేటర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఆధార్‌ సెంటర్లలో పనివేళలను, లబ్ధిదారుల అవసరాలను సమన్వయ పరిస్తే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుందన్నారు. దీని కోసం వలంటీర్లు ఈకేవైసీ అవసరమైన లబ్ధిదారులకు ఆధార్‌ సెంటర్లకు వెళ్లాల్సిన సమయాన్ని, ఆధార్‌ సెంటర్ల చిరునామాను తెలియజేస్తారన్నారు. వలంటీర్లు సూచించిన ప్రకారం ఆధార్‌ సెం టర్‌కు వెళ్లడం వల్ల సమయం వృథా కాకుండా ఈకేవైసీ పూర్తవుతుందన్నారు. ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ అయిన తర్వాత వలంటీర్లకు తెలియపరిస్తే వారు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఈకేవైసీ అప్‌డేట్‌ చేస్తారని ఆయన తెలిపారు.

Updated Date - 2021-09-04T05:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising