ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ బాధితులను ఆదుకోండి

ABN, First Publish Date - 2021-06-19T05:16:14+05:30

భానుగుడి (కాకినాడ), జూన్‌ 18: కొవిడ్‌ కారణంగా నష్టపోయిన ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన తెలిపి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆక్సిజన్‌ అందక చనిపోయిన బాధితులకు రూ.25 లక్షలు, బ్లాక్‌ఫంగ్‌సతో చనిపోయినవారి కు

కాకినాడ ఆర్డీవో ఆఫీసు వద్ద నిరసన తెలుపుతున్న కొండబాబు, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు

భానుగుడి (కాకినాడ), జూన్‌ 18: కొవిడ్‌ కారణంగా నష్టపోయిన ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన తెలిపి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆక్సిజన్‌ అందక చనిపోయిన బాధితులకు రూ.25 లక్షలు, బ్లాక్‌ఫంగ్‌సతో చనిపోయినవారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా వల్ల ఉపాధి కొల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ.10వేలు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ వర్తింపజేయాలన్నారు. 18ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్‌ వేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, కీల్లాభక్తుల అప్పారావు, బంగారు సత్యనారాయణ, తుమ్మల రమేష్‌, అంబటి చిన్న, గజ్జుబాబు, ఎస్‌కే రహీమ్‌, ఎండీ అన్సారీ పాల్గొన్నారు. 


న్యాయం చేయండి

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 18: కొవిడ్‌ బాధితులకు న్యాయం చేయాలంటూ వారి తరుపున వినతిపత్రాన్ని కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకరపావని, టీడీపీ నాయకులు పిల్లి సత్తిబాబు, సుంకర తిరుమల కుమార్‌, కార్పొరేటర్‌ పలివెల త్రిమూర్తులు, ఇతర నాయకులు ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు. 

Updated Date - 2021-06-19T05:16:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising