ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు జూమ్‌ వేదికగా ‘కవిసంధ్య’ పురస్కారాల ప్రదానం

ABN, First Publish Date - 2021-10-29T05:22:13+05:30

భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో కవిసంధ్య, సాహిత్య సాంస్కృతిక సంస్థ యానాం నిర్వహణలో 30న కవిసంధ్య ప్రతిభా పురస్కారాలు జూమ్‌ వేదికపై ప్రదానం చేయనున్నట్లు కవిసంధ్య అధ్యక్షుడు శిఖామణి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానాం, అక్టోబరు 28: భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో కవిసంధ్య, సాహిత్య సాంస్కృతిక సంస్థ యానాం నిర్వహణలో 30న కవిసంధ్య ప్రతిభా పురస్కారాలు జూమ్‌ వేదికపై ప్రదానం చేయనున్నట్లు కవిసంధ్య అధ్యక్షుడు శిఖామణి చెప్పారు. నగ్నముని, చెల్లి సురేంద్రదేవ్‌కు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.    30వ తేదీ శనివారం సాయంత్రం 5.30కు డాక్టర్‌ అత్తలూరి నరసింహారావు వేదిక, రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌, జూమ్‌ వేదికగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ముఖ్యఅతిఽథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌, అధ్యక్షుడిగా సరస్వతీ సామ్మాన్‌ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి, సభా ప్రారంభకులుగా తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్‌ మామిడి హరికృష్ణ, విశిష్ణ అతిథిగా ప్రముఖ చలనచిత్రనటుడు, రచయిత తనికెళ్ల భరణి, గౌరవ అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్‌ ఓల్గా, ఆంధ్రజ్యోతి సంపాదకుడు డాక్టర్‌ కె.శ్రీనివాస్‌, డి.విజయ్‌భాస్కర్‌, కె.వేంకటేశ్వరరెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు చెప్పారు. శిఖామణి సాహితీ పురస్కారంతో పాటు 12 మంది కవులకు కవిసంధ్య ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

Updated Date - 2021-10-29T05:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising