ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగుమారిన ధాన్యానికీ మద్దతు ధర: ఆర్డీవో

ABN, First Publish Date - 2021-12-16T05:08:58+05:30

కరప, డిసెంబరు 15: రంగుమారిన ధాన్యానికి కూడా మద్దతు ధర చెల్లిస్తామని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మండలంలోని వాకాడలో బుధవారం పర్యటించి రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 7

వాకాడలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో చిన్నికృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరప, డిసెంబరు 15: రంగుమారిన ధాన్యానికి కూడా మద్దతు ధర చెల్లిస్తామని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మండలంలోని వాకాడలో బుధవారం పర్యటించి రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 75 కిలోల సాధారణ రకానికి కనీస మద్దతు ధరను రూ.1,455గా  ప్రభుత్వం నిర్ధారించిందన్నారు. పలువురు రైతులు దళారులను ఆశ్రయించి రంగుమారిన ధాన్యాన్ని తక్కువ ధరకే అమ్ముకుంటున్నారన్నారు. ఈ దుస్థితి నుంచి రైతులను కాపాడేందుకు రంగుమారిన ధాన్యానికి కూడా రూ.1,455 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే 75 కిలోలకు అదనంగా మరో ఏడుకిలోలు కలిపి 82కిలోల తూకంతో ధాన్యం అమ్మాలని కోరారు. దీనికి హమాలీల కూలీ, రవాణా చార్జీలు అదనమన్నారు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఆర్‌బీకేల ద్వారా ధాన్యం  అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఓటీఎస్‌ పథకంపై సమీక్ష జరిపారు. 2014-19 మధ్య ఇంటి పట్టాలు పొంది ఎటువంటి రుణం తీసుకోని లబ్ధిదారులకు కేవలం రూ.10కే రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని ఆర్డీవో చెప్పారు.

Updated Date - 2021-12-16T05:08:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising