ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహ హక్కు కాదు.. జగనన్న దోపిడీ పథకం

ABN, First Publish Date - 2021-12-01T05:50:13+05:30

కాకినాడ సిటీ, నవంబరు 30: ఇది సంపూర్ణ గృహ హక్కు పథకం కాదని, జగనన్న దోపిడీ పథకమని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. దుమ్ములపేట మున్సిపల్‌ స్కూల్‌ వద్ద మంగళవారం గృహ లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పఽథకం కింద వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో రిజిస్ట్రేషన్లు చేస్తామని వైసీపీ ప్రభుత్వం పేదలను రాబందుల్లా పట్టి పీడిస్తోందన్నారు

సమావేశంలో మాట్లాడుతున్న కొండబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు విమర్శ 

కాకినాడ సిటీ, నవంబరు 30: ఇది సంపూర్ణ గృహ హక్కు పథకం కాదని, జగనన్న దోపిడీ పథకమని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. దుమ్ములపేట మున్సిపల్‌ స్కూల్‌ వద్ద మంగళవారం గృహ లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో రిజిస్ట్రేషన్లు చేస్తామని వైసీపీ ప్రభుత్వం పేదలను రాబందుల్లా పట్టి పీడిస్తోందన్నారు. 1983 నుంచి 2011 వరకు గత ప్రభుత్వాలు మంజూరు చేసిన గృహ రుణాలు ఇప్పుడు కట్టమని బలవంతంగా వసూలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, వివిధ పన్నులతో ప్రజలపై గుదిబండ మోపిన ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు గృహ రుణాల వసూలు పేరుతో దోపిడీ చేస్తోందని ఆయన విమర్శించారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ డబ్బులు కట్టకపోతే అమ్మఒడి, రేషన్‌ కార్డులు రద్దు చేస్తామని సచివాలయ సిబ్బంది బెదిరింపు ఽధోరణితో మాట్లాడుతున్నారన్నారు. గృహలబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు బలవంతం పెడితే, ఎందుకు కట్టాలని ప్రశ్నించే హక్కు లబ్ధిదారులకు ఉందని కొండబాబు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్‌, కార్పొరేటర్లు వొమ్మి బాలాజీ, తుమ్మల సునీత, 10వ డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి మూగు రాజు, టీడీపీ నాయకులు తుమ్మల కొండలరావు, ఎరిపిల్లి రాము, గంపల లక్ష్మణరావు, కాశరపు సింహాద్రి, పేర్ల అప్పారావు, ఎరిపల్లి నూకరాజు, వాసిపిల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T05:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising