జక్కంపూడి రాజాపై కేసులు ఎత్తివేత
ABN, First Publish Date - 2021-07-01T06:06:26+05:30
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌పై గతంలో నమో దైన పోలీసు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 30: రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌పై గతంలో నమో దైన పోలీసు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. రాజాపై రాజమహే ంద్రవరం త్రీటౌన్ స్టేషన్‌లో 2015లో సెక్షన్ 143, 341,189, 290, 506 రెడ్ విత్ సెక్షన్ 149, ఐపీసీ 1860 ప్రకారం నమోదు చేసిన కేసులు, ప్రకాష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైం నెం.231/2016 అండర్ సెక్షన్ 353, 323, 506 రెడ్‌విత్ సెక్షన్ 34 ఐపీసీ 1860 కింద నమోదైన కేసులను రద్దు చేస్తూ హోం శాఖ జీవో నెం.594 జారీ చేసింది. అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఆరోపణలపై అప్పట్లో ఈ కేసులు నమోదయ్యాయి.
Updated Date - 2021-07-01T06:06:26+05:30 IST