ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కదారి పట్టిన ‘జగనన్న గోరుముద్ద’

ABN, First Publish Date - 2021-10-24T07:03:35+05:30

ప్రత్తిపాడు మండలం శరభవరం మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన జగనన్న గోరుముద్ద సరుకులు పక్కదారి పట్టాయి. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీర్రాజు శనివారం వాటిని దారి మళ్లిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.

శరభవరం పాఠశాల వద్ద పౌష్టికాహారానికి సంబంధించిన గుడ్లు, వేరుశనగ అచ్చులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సామగ్రి తరలిస్తుండగా హెచ్‌ఎంని పట్టుకున్న గ్రామస్థులు

ప్రత్తిపాడు, అక్టోబరు 23: ప్రత్తిపాడు మండలం శరభవరం మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన జగనన్న గోరుముద్ద సరుకులు పక్కదారి పట్టాయి. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీర్రాజు శనివారం వాటిని దారి మళ్లిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. జగనన్న గోరుముద్ద పేరుతో పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం కోడిగుడ్లను, వేరుశనగ అచ్చులను పాఠశాలకు సరఫరా చేస్తుంది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే వీటిని తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. నల్లటి ప్లాస్టిక్‌ కవర్‌లో ఏడు కోడిగుడ్ల అట్టలను, ఆరు వేరుశనగ అచ్చుల ప్యాకెట్లను నింపుకుని మోటర్‌సైకిల్‌పై ఈ ప్యాక్‌ను పట్టుకుని తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. దీనిపై ప్రత్తిపాడు ఎంఈవో వి.రాజబాబును వివరణ కోరంగా ప్రధానోపాధ్యాయుడు వీటి ని కొనుగోలు చేసి తరలిస్తున్నట్టు తమకు చెప్పారని, దీనిపై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2021-10-24T07:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising