ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పొలంబడి

ABN, First Publish Date - 2021-07-29T05:05:49+05:30

సర్పవరం జంక్షన్‌, జూలై 28: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో పంట ఎంపిక నుంచి ఉత్పత్తుల మార్కెటింగ్‌ వరకు ప్రతీ విషయంలో ఉత్తమ ఆచరణ, యాజమాన్య పద్ధతులను రైతులకు ఎప్పటికప్పుడూ అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం పొలంబడి నిర్వహిస్తున్నట్టు ఇన్‌చార్జి కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు. బుధవారం పండూరులో వ్యవసాయశాఖ ఏడీ పద్మశ్రీ ఆధ్వర్యాన రైతులతో నిర్వహించిన పొ

పండూరులో రైతులతో మాట్లాడుతున్న లక్ష్మీశ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్‌చార్జి కలెక్టర్‌ లక్ష్మీశ

సర్పవరం జంక్షన్‌, జూలై 28: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో పంట ఎంపిక నుంచి ఉత్పత్తుల మార్కెటింగ్‌ వరకు ప్రతీ విషయంలో ఉత్తమ ఆచరణ, యాజమాన్య పద్ధతులను రైతులకు ఎప్పటికప్పుడూ అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం పొలంబడి నిర్వహిస్తున్నట్టు ఇన్‌చార్జి కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు. బుధవారం పండూరులో వ్యవసాయశాఖ ఏడీ పద్మశ్రీ ఆధ్వర్యాన రైతులతో నిర్వహించిన పొలంబడి అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంట సాగులో మెళకువలు, సాంకేతిక పరిజ్ఞానంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, వీఏఏలు సలహాలు, సూచనలు అందిస్తారన్నారు. వరిసాగులో అవసరమైన మేరకే పెట్టుబడి పెట్టడం, ఖర్చు తగ్గించుకునే దిశగా వరిసాగు చేపట్టాలన్నారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం తోడ్పాటు ఉంటుందన్నారు. వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆర్‌బీకే స్థాయిలో రైతుల కోసం విలేజ్‌ అడ్వయిజరీ బోర్డు సమావేశాలు జరుగుతాయని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రైతుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేడీ ఎన్‌.విజయ్‌కుమార్‌, తహశీల్దార్‌ వేముల మురళీకృష్ణ, ఆర్‌ఐ వై.శ్రీనివాస్‌, వైసీపీ నాయకులు వలవల వెంకటేశ్వరరావు, వీఏబీ చైర్మన్‌ నందిపాటి వెంకట శ్రీనివాస్‌, నందిపాటి సత్తిబాబు, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-29T05:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising