ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-06-23T06:07:49+05:30

ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గృహనిర్మాణ పనులు వేగవంతం చేయా లని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(హౌసింగ్‌) ఎ.భార్గవ్‌తేజ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, జూన్‌ 22: ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గృహనిర్మాణ పనులు వేగవంతం చేయా లని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(హౌసింగ్‌) ఎ.భార్గవ్‌తేజ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.  అమలాపురం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మండల, డివిజన్‌స్థాయి అధికారులతో గృహనిర్మాణాలకు సంబంధించి ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు అధ్యక్షతన మంగళవారం జేసీ సమీక్ష నిర్వహించారు. లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన గురించి ఆరా తీశారు. స్టోన్‌ ప్లాంటేషన్‌, జియో ట్యాగింగ్‌, లేఅవుట్లలో మెరక పనులు, విద్యుత్‌ సరఫరా, వాటర్‌ సప్లయి తదితర పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఇచ్చే డ్వాకా రుణాలకు  సంబంధించి వస్తున్న సమస్యలపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహి స్తామన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గృహనిర్మాణ పనుల్లో పురోగతిని సాధించాలని జేసీ  కోరారు. డీఎల్‌డీవో వి.శాంతామణి, గృహనిర్మాణశాఖ ఈఈ ఎన్‌.గణపతి, డీఈఈ మావూరి నాగరాజు, ఏఈ డీవీ ప్రసాద రాజు, ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈ పార్ధసారథి, ఎలక్ర్టికల్‌ డీఈ పి.సాల్మన్‌రాజు, ఎంపీడీవో ఎం.ప్రభాకరరావు, తహశీల్దార్‌ జి.రవీంద్రనాథ్‌ఠాగూర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T06:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising