ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిలే నిరాహార దీక్ష విరమించిన కౌలు రైతులు

ABN, First Publish Date - 2021-07-27T06:45:30+05:30

హైకోర్డు ఉత్తర్వుల మేరకు కౌలురైతులు మంగళవారం రిలే నిరాహార దీక్షలను విరమించారు. మండలం లోని లింగంపర్తిలో ఇటీవల మూ డు దేవస్థానాల భూములకు నిర్వహించిన హెచ్చు కౌలు వేలం పాటలను రద్దు చేయాలంటూ సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు నాయకత్వంలో దళిత, పేద కౌలు రైతులు 12రోజులుగా తహశీల్దార్‌ కార్యాలయంవద్ద రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలేశ్వరం, జూలై 26: హైకోర్డు ఉత్తర్వుల మేరకు కౌలురైతులు మంగళవారం రిలే నిరాహార దీక్షలను విరమించారు. మండలం లోని లింగంపర్తిలో ఇటీవల మూ డు దేవస్థానాల భూములకు నిర్వహించిన హెచ్చు కౌలు వేలం పాటలను రద్దు చేయాలంటూ సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు నాయకత్వంలో దళిత, పేద కౌలు రైతులు 12రోజులుగా తహశీల్దార్‌ కార్యాలయంవద్ద రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు. అధికారులనుంచి సమస్య పరిష్కారానికి స్పందన లభించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని గణేశ్వరరావు తెలిపారు. సాగు భూములకు నెలరోజుల గడువు వరకు బహిరంగ కౌలు వేలం నిర్వహించవద్దని మినహాయింపునిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. దీంతో డిప్యూటీ తహశీల్దార్‌ గురుమూర్తిరెడ్డి శిబిరంలో బైఠాయించిన కౌలు రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసినట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గండేటి నాగమణి, సురేష్‌, కందుల త్రిమూర్తులు, సాయి, రమణ, సోమాల కుశలన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:45:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising