పలుచోట్ల వర్షం
ABN, First Publish Date - 2021-06-24T04:46:04+05:30
పిఠాపురం, జూన్ 23: పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో బుధవారం భారీవర్షం కురిసింది. గంటన్నర పాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లి రోడ్లపైకి నీరు చేరింది. పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అందులో నుంచే రాకపోకలు
పిఠాపురం, గొల్లప్రోలులో భారీవాన
పిఠాపురం, జూన్ 23: పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో బుధవారం భారీవర్షం కురిసింది. గంటన్నర పాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లి రోడ్లపైకి నీరు చేరింది. పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అందులో నుంచే రాకపోకలు సాగించారు. వర్షంతో వాతావరణం చల్లబడి ప్రజలు సేదతీరారు. మరోవైపు వర్షంతో గ్రామాల్లో వ్యవసాయ పనులు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రత్తిపాడులో...
ప్రత్తిపాడు: మండలంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయ ంత్రం వరకు పలుమార్లు విడతల వారీగా వర్షం పడింది. దీంతో మండలంలోని చెరువులు, పల్లపు ప్రాంతాల్లో వర్షపునీరు పెద్ద ఎత్తున చేరింది.
కొత్తపల్లిలో...
కొత్తపల్లి: కొత్తపల్లిలో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల ఎండ తీవ్రతతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలు వర్షం రాకతో సేదతీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై ఉంది.
సామర్లకోటలో...
సామర్లకోట: సామర్లకోటలో బుధవారం వర్షం కురవడంతో దుక్కిదున్ను, దమ్ము వ్యవసాయ పనులను రైతులు ప్రారంభించారు. మరికొందరు పంటకాలువలలో పూడిక తీసివేత పనులు, బాట పనులు చేపట్టారు.
Updated Date - 2021-06-24T04:46:04+05:30 IST