ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈదురుగాలులు, భారీ వర్షం

ABN, First Publish Date - 2021-05-07T05:45:34+05:30

ఈదురుగాలులు, భారీ వర్షం12 నుంచి 1 గంట వరకు ఏకధాటిగా వర్షం కురవడంతో డ్రైనేజీల్లో నీరు ప్రధాన రోడ్లపై పొంగిపొర్లింది.

గండేపల్లి మండలం యల్లమిల్లిలో నేలనంటిన అరటి తోట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గండేపల్లి, ప్రత్తిపాడు మండలాల్లో నేలవాలిన అరటి చెట్లు

తడిసి ముద్దయిన ధాన్యం నిల్వలు

జగ్గంపేట/జగ్గంపేట రూరల్‌, మే 6: ఈదురుగాలులు, భారీ వర్షం12 నుంచి 1 గంట వరకు ఏకధాటిగా వర్షం కురవడంతో డ్రైనేజీల్లో నీరు ప్రధాన రోడ్లపై పొంగిపొర్లింది. ప్రస్తుత తరుణంలో మెట్టలో కూర గాయలు, స్వీట్‌కార్న్‌ పంటలకు ఈ వర్షం ఉపయోగపడు తుందని రైతులు తెలిపారు. అయితే మే మొదటి వారంలో ఇటువంటి వర్షాలు కురవడం వల్ల చేతికి అందు తున్న మా మిడి పంట పాడవుతుందని వారంటున్నారు. ఏది ఏమైనప్ప టికీ కర్ఫ్యూ సమయం మొదలయ్యేసరికి జోరుగా వర్షం కుర వడంతో రోజువారీ కూలీలు, శ్రామికులు ఇళ్లకు చేరుకుని సేదతీరారు. జగ్గంపేట మండలంలోని కొన్ని గ్రామాల్లో దాళ్వా వరి పంట కోత కోసి నూర్పిళ్లు చేసే సమయంలో ఒక్కసారిగా వర్షం రావడంతో అటు ధాన్యం నిల్వలు, వరికుప్పలు తడిసి ముద్దయ్యాయి. 

గండేపల్లి: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మండలంలోని పలు గ్రామాల్లో అరటి తోటలు నేలవాలాయి. సుమారు 30 ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు చెప్తున్నారు. వ్యవసాయాధికారులు నష్టాన్ని గురించి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రత్తిపాడు: బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులు మండలవ్యాప్తంగా అరటి తోటలు ధ్వంసమయ్యాయి. 20 రోజుల వ్యవధిలో మూడుసార్లు వీచిన ఈదురుగాలులకు అరటి తోటలు నేలవాలాయి. లంపకలోవ, పెద్దిపాలెం, రౌతు పాలెం, పొదురుపాక, గోకవరం, ఉత్తరకంచి గ్రామాల  రైతు లు నష్టాల్లో చిక్కుకున్నారు. ఉద్యానవన శాఖాధికారులు చర్య లు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


Updated Date - 2021-05-07T05:45:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising