ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడా స్ఫూర్తితో మెలగాలి

ABN, First Publish Date - 2021-03-21T06:05:29+05:30

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి అన్నారు. ఎంఎస్‌ఎన్‌ చార్టీస్‌ ఆవరణలో జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో 6వ రాష్ట్రస్థాయి ప్రసంగి వెంకటరత్నం స్మారక హ్యాండ్‌బాల్‌ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

పోటీ జరుగుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే ద్వారంపూడి

కాకినాడస్పోర్ట్స్‌, మార్చి 20: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని  కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి అన్నారు. ఎంఎస్‌ఎన్‌ చార్టీస్‌ ఆవరణలో జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో 6వ రాష్ట్రస్థాయి ప్రసంగి వెంకటరత్నం స్మారక హ్యాండ్‌బాల్‌ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైన వివిధ జిల్లాల క్రీడాకారులు తమతమ జిల్లాలకు పేరు తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి క్రీడలకు రాష్ట్రంలో పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఇండోర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలలో రాణించాలన్నారు. పోటీల నిర్వాహకులు దుర్గాప్రసాద్‌, ఎస్‌.వెంకటేశ్వరరావును ఆయన అభినందించారు. రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు ఎస్‌.కృష్ణకుమార్‌  మాట్లాడుతూ  హ్యాండ్‌బాల్‌ సంఘం మాజీ కార్యదర్శి ఎన్‌.నర్సింహమూర్తి వద్ద శిక్షణ పొందిన 80  మంది హ్యాండ్‌బాల్‌ క్రీడాకారులు వివిధ శాఖల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారన్నారు.  కార్పొరేటర్లు చవ్వాకుల రాంబాబు, చోడిపల్లి సత్యప్రసాద్‌, మీసాల శ్రీదేవి దుర్గాప్రసాద్‌, మీసాల ఉదయ్‌కుమార్‌, సీఐ రాంమోహన్‌రెడ్డి, మల్లాడి శివరాంనాయక్‌, పీడీలు ఎల్‌.గోవింద్‌, డాక్టర్‌ కె.స్పర్జన్‌రాజు, రంగారావు, భాను, జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘ కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వరరావు, పీడీ స్వామి, పోటీల నిర్వహణా కార్యదర్శి రవికుమార్‌, సత్తిరాజు, భవాని, పోటీల పరిశీలకుడు వంశీ తదితరులు పాల్గొన్నారు.  శనివారం నిర్వహించిన పోటీలలో గుంటూరుపై తూర్పు, శ్రీకాకుళంపై పశ్చిమగోదావరి, పశ్చిమగోదావరిపై కృష్ణ, విజయనగరంపై తూర్పు విజయం  సాధించాయి. 

Updated Date - 2021-03-21T06:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising