ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారికాచి దోచుకుంటున్న గుజరాత్‌ మహిళలు

ABN, First Publish Date - 2021-03-04T06:51:49+05:30

రోడ్డుపై ప్రయాణికులను ఆపి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్న గుజరాతీ మహిళల ముఠాను కాకినాడ త్రీటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసుల అదుపులో మహిళలు

కాకినాడ క్రైం, మార్చి 3: రోడ్డుపై ప్రయాణికులను ఆపి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్న గుజరాతీ మహిళల ముఠాను  కాకినాడ త్రీటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ సభ్యులుగా చెప్పు కుంటూ బల వంతంగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది మహిళలు విద్యార్థులకు మ్యాజిక్‌ బుక్స్‌, స్టేషనరీ విక్రయించేవారు. రోడ్డు పక్కన బస చేసేవారు. కరోనా తర్వాత స్కూళ్లు మూతపడడంతో రూటు మార్చారు. హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో విరాళాలు సేకరిస్తున్నామంటూ ప్రయాణికులను ఆపి వారి నుంచి బలవంతంగా డబ్బులు సేకరించడం మొదలుపెట్టారు. కాకినాడ బీచ్‌రోడ్డు, కోరమండల్‌ ఏరియా, అచ్చంపేట సెంటర్‌, ఏడీబీ రోడ్డుతో పాటు కాకినాడ న్యూపోర్టు రైల్వేస్టేషన్‌ సమీప ప్రాంతాల్లో మకాం ఏర్పాటు చేసుకుని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.  దీనిపై ఫిర్యాదులు అందడంతో జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ ఆదేశాల మేరకు డీఎస్పీ భీమారావు నేతృత్వంలో సీఐ శ్రీరామకోటేశ్వరరావు, ఎస్‌ఐ రాంబాబు సిబ్బందితో కలసి బుఽధవారం 12 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. బలవంతపు వసూళ్లతోనే సరిపెడుతున్నారా? లేక దొంగతనాలకు పాల్పడుతున్నారా అనే విషయాలను రాబట్టేందుకు విచారణ నిర్వహిస్తున్నారు.  

Updated Date - 2021-03-04T06:51:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising