ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా పండిత సదస్యం

ABN, First Publish Date - 2021-02-26T06:09:33+05:30

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం ఆలయ పురాతన కల్యాణ మండపం వద్ద నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్లను ప్రత్యేక సింహాసనంపై అలంకరించి పండిత సదస్యం నిర్వహించారు.

అంతర్వేదిలో పండిత సదస్యం నిర్వహిస్తున్న అర్చకస్వాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘట్టం
  • ప్రత్యేక సింహాసనంపై స్వామి, అమ్మవారు 

అంతర్వేది, ఫిబ్రవరి 25: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం ఆలయ పురాతన కల్యాణ మండపం వద్ద నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్లను ప్రత్యేక సింహాసనంపై అలంకరించి పండిత సదస్యం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్‌, స్థానాచార్యులు వింజమూరి రంగాచార్యులు, వేదపండితులు చింతా వెంకటశాసి్త్ర, అర్చకస్వాములు సారథ్యంలో ప్రత్యేక మంత్రోచ్ఛారణల నడుమ స్వామి, అమ్మవార్లకు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి కల్యాణం, రథోత్సవం ముగించుకున్న అనంతరం స్వామి, అమ్మవార్ల ఆశీర్వచనం పొందే ఈ ఘట్టం భక్తులను పులకింపజేసింది. ఈ పండితసదస్యంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ, వలవల రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T06:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising