ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదేం ‘పరీక్ష’

ABN, First Publish Date - 2021-07-27T06:39:15+05:30

జాబ్‌ కేలండర్‌లో తమకు అన్యాయం చేశారని నిరుద్యోగులు ఓవైపు నిరసనలు తెలియజేస్తుండగా, ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మళ్లీ పరీక్షలేమిటంటూ సచివాలయ ఉద్యోగులు నిల దీస్తున్నారు. రెండేళ్లలో మీ ఉద్యోగాలు పర్మినెంటు చేస్తామంటూ చెప్పి ఇప్పుడు పరీక్ష రాసి ఉత్తీర్ణులవ్వాలని షరతు విధించడంపై ఆ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సచివాలయ ఉద్యోగులకు మళ్లీ పరీక్ష

అక్టోబరుకు రెండేళ్లు పూర్తి

పర్మినెంట్‌  చేస్తామని ముందు ప్రకటన

సర్వీసు రిజిస్టర్లు ప్రారంభం

కానీ మళ్లీ పరీక్ష ప్రకటనతో ఉద్యోగుల్లో ఆందోళన

పరీక్షలు లేకుండా పర్మినెంట్‌ చేయాలని    

 సీఎంకు ఉద్యోగ సంఘాల వినతి


జాబ్‌ కేలండర్‌లో తమకు అన్యాయం చేశారని నిరుద్యోగులు ఓవైపు నిరసనలు తెలియజేస్తుండగా, ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మళ్లీ పరీక్షలేమిటంటూ సచివాలయ ఉద్యోగులు నిల దీస్తున్నారు. రెండేళ్లలో మీ ఉద్యోగాలు పర్మినెంటు చేస్తామంటూ చెప్పి ఇప్పుడు పరీక్ష రాసి ఉత్తీర్ణులవ్వాలని షరతు విధించడంపై ఆ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. 


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

సచివాలయ ఉద్యోగులకు మళ్లీ పరీక్ష పెడతామని ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. రెండేళ్లలో పర్మినెంట్‌ చేస్తామని మొదట్లో చెప్పారు.. అలా అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. అప్పటినుంచి నెలకు రూ. 15 వేల జీతం ఇస్తూ పనిచేయించుకుంటున్నారు. కరోనా సమ యంలో ఎప్పటి సమాచారం అప్పుడు అందివ్వడంలోనూ, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలోనూ సచివాలయ ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంది. కరోనా సమయం లో అన్ని విభాగాల ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. కానీ సచివాలయ  ఉద్యోగులు మాత్రం కరోనా విజృంభించిన సమయంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేయించుకున్నారు. ఇక వ్యాక్సినేషన్‌ సమయంలోనూ వీరి పాత్ర కీలకంగా ఉంది. అక్టోబరు నెలకు వీరికి రెండేళ్లు పూర్తవుతోంది.  రెండు నెలల కిందట వీరికి సర్వీసు రిజిస్టర్లు కూడా ప్రారంభించారు. అక్టోబరు నుంచి పర్మినెంట్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగులు చాలా అనం దం వ్యక్తంచేశారు. వీరి జీతం సుమారు 30 వేలకు పైగా అవుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. ఇంతలో పిడుగుపడినట్టు మళ్లీ రెండు పరీక్షలు రాయాలని, అప్పుడే పర్మినెంటు అవుతారని ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఉత్తీర్ణులైతేనే పర్మినెంట్‌ చేస్తామని అధికారులు చెబుతున్నారు.


మరోవైపు ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ కూడా మొదలు పెట్టారు. వాటికి కచ్చితంగా హాజరు కావాలనే షరతు కూడా పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా వీరికి ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిర్వహిం చే రెండు పరీక్షల్లోనూ ఉత్తీర్ణులు కావాలి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళ న మొదలైంది. రాష్ట్రంలో లక్షా 70 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా పరీక్ష రాసి ఉత్తీర్ణులైతేనే పర్మినెంటు అవుతారు. లేదంటే ప్రొబేషన్‌లోనే కొనసాగుతారు. దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉంటాయో పూర్తిగా వెల్లడి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మళ్లీ పరీక్షలు పెట్టొద్దని, ఇతర ఉద్యోగులకు మాదిరిగానే తమను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ డెమోక్రాటిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ గ్రూప్‌ వార్డు సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు.

Updated Date - 2021-07-27T06:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising