ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరుల ‘కార్తీకం’

ABN, First Publish Date - 2021-12-15T07:02:48+05:30

రత్నగిరివాసుడైన సత్యదేవుడికి ఈ ఏడాది కార్తీకం కానుకల వర్షం కురిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యదేవుడికి వివిధ రూపాల్లో రూ.18.95 కోట్ల ఆదాయం

ఇందులో ఒక్క స్వామి వారి వ్రతాల ద్వారానే రూ.6.91 కోట్లు

ఇప్పటివరకు ఇదే రికార్డు 8 గత రికార్డు రూ.16.24 కోట్లు

అన్నవరం, డిసెంబరు 14: రత్నగిరివాసుడైన సత్యదేవుడికి ఈ ఏడాది కార్తీకం కానుకల వర్షం కురిపించింది. ఇప్పటివరకు కార్తీక మాసాల్లో లభిం చిన ఆదాయంలో ఇదే రికార్డు అని ఆలయ ఈవో త్రినాథరావు చెప్పారు. నెలరోజులకు వివిధ పద్దుల కింద రూ.18,95,63,603 ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 2019లో వచ్చిన ఆదాయం రూ.16,24,96,735 ఒక రికార్డుగా నిలవగా, ఆ రికార్డును ఈ ఏడాది కార్తీకం బ్రేక్‌ చేసింది. గడిచిన 2020లో కరోనా కారణంగా భక్తుల రద్దీ తగ్గడంతో కేవలం రూ.10.86 కోట్ల ఆదాయమే లభించింది. ఈ ఏడాది కార్తీకమాసం వ్రతాల సంఖ్య అంచనాల మేరకు పెరగకపోయినా ఆదాయం మాత్రం పెరగడం విశేషం. వివిధ విభాగాల వారీగా ఆదాయం చూస్తే వ్రతాల ద్వారా రూ.6.91 కోట్లు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.4.57 కోట్లు, హుండీల ద్వారా రూ.2.81 కోట్లు, సత్రం గదుల అద్దెల ద్వారా రూ. 82.65 లక్షలు, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.90.32 లక్షల ఆదాయం సమకూరింది. 2019తో పోలిస్తే టోల్‌గేట్‌, సత్రాలు, కవర్ల ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గాయి. కార్తీకమాసం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సహకరించి, సేవలందించిన రెవెన్యూ, పోలీసు, మెడికల్‌, హెల్త్‌, ఫైర్‌, ఇరిగేషన్‌, విద్యుత్‌ విభాగాల అధికారులకు ఈవో కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-12-15T07:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising