ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్లపై చెత్తకు కమిషనర్‌ జరిమానా

ABN, First Publish Date - 2021-11-26T07:18:56+05:30

క్లాప్‌ కార్యక్రమాన్ని ఎంతో ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్న సమయంలో పౌరులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 25: క్లాప్‌ కార్యక్రమాన్ని ఎంతో ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్న సమయంలో పౌరులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ హెచ్చరించారు. రాజమహేందరవరం నగరంలోని 38, 41 డివిజన్ల లో గురువారం ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై చెత్తచెదారాలు భారీగా పేరుకుపోయి ఉండడాన్ని చూసిన ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఆరా తీయగా ఆ ప్రాంతంలో ఒక ఫంక్షన్‌ జరిగిందని, అక్కడి వ్యర్థాలు రోడ్డుపై పడవేశారని తెలిసింది. దీంతో ఆయన వారికి రూ.2500 జరిమానా విధించారు. ఆహార పదార్థాలు రోడ్లపై వేయడం వల్ల అటుగా వెళ్లే ప్రజ లు, స్థానికులు చాలా ఇబ్బందులు పడతారని, మళ్లీ ఇలాంటి పరిస్థితి పునరావృత్తం కాకూడదని హెచ్చరించారు. ఫంక్షన్లు జరిగినప్పుడు ముందుగా పారిశుధ్య సిబ్బందికి తెలియజేస్తే డస్డ్‌ బిన్ను ఏర్పాటుచేస్తారన్నారు. కమిషనర్‌ వెంట డిప్యూటీ కమిషనర్‌ సాంబశివరావు, శానిటరీ సూపర్‌వైజర్‌ ఇంద్రగంటి శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - 2021-11-26T07:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising