ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల పరిహారం కోసం గర్జించిన టీడీపీ నాయకులు

ABN, First Publish Date - 2021-12-03T05:41:42+05:30

ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని 48 గంటల్లో చెల్లించాలని, తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రైతుల తరపున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని టీడీపీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు.

ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ నాయకుల ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రామచంద్రపురం డిసెంబరు 2: ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని 48 గంటల్లో చెల్లించాలని, తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రైతుల తరపున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని టీడీపీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. రామచంద్రపురం, మండపేట, అనపర్తి నియోజకవర్గాల నాయకులు ఆర్‌ఎస్‌, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం కార్యకర్తలు, నాయకులు, రైతులు ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పిన వైసీపీ ప్రజాప్రతినిధులు వారిని పట్టించుకోకపోవడం  బాధాకరమన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలను తక్షణం అందించాలని డిమాండ్‌ చేశారు.  అనంతరం ఆర్డీవో సింధుసుబ్రహ్మణ్యానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కడియాల రాఘవన్‌, నండూరి ఫణికుమార్‌, చుండ్రు శ్రీవరప్రకాష్‌, కొవ్వూరి ఆదిరెడ్డి, ఉంగరాల రాంబాబు, పులగం అచ్చిరెడ్డి, మేడిశెట్టి సూర్యనారాయణ, కొమరిన వీర్రాజు, మేడిశెట్టి రవికుమార్‌, గరికపాటి సూర్యనారాయణ, జాస్తి విజయలక్ష్మి, పెందుర్తి విజయలక్ష్మి, ఖండవిల్లి విజయరాజ్‌, జొన్నకూటి భాస్కర్‌, కొసనా శ్రీను, పెందుర్తి భానుమూర్తి, వంజరపు రాజేశ్వరి, అక్కల రిష్వంత్‌ రాయ్‌, ఈదల దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T05:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising