ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్షణ కల్పించండి

ABN, First Publish Date - 2021-07-27T05:34:06+05:30

ప్రభుత్వం అవలంబిస్తున్న అన్యాయాలు, అక్రమాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న తనపై, టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు ప్రయత్నిస్తున్న వైసీపీ పార్టీ శ్రేణుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీని ఆశ్రయించారు.

ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వినతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ క్రైం, జూలై 26: ప్రభుత్వం అవలంబిస్తున్న అన్యాయాలు, అక్రమాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న తనపై, టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు ప్రయత్నిస్తున్న వైసీపీ పార్టీ శ్రేణుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీని ఆశ్రయించారు.  మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబును సోమవారం కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. అయితే పెద్దాడ గ్రామ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో గత ఏడాది మార్చి 11న నామినేషన్ల సందర్భంగా పెదపూడి మండల కార్యాలయంలో కొంత మంది వైసీపీ పార్టీ నాయకులు తనపై దాడికి ప్రయత్నించగా తప్పించుకున్నట్లు చెప్పారు.   అప్పట్లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు  చేయలేదన్నారు. బిక్కవోలు మండలం కాపవరంలో అక్రమంగా గ్రావెల్‌ మైనింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారంతో అక్కడకు పరిశీలనకు వెళ్లిన తనపై వైసీపీ పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ, వైసీపీ నాయకుల నిరంకుశ విధానాలను ప్రజాస్వామ్యరీతిలో ప్రశ్నిస్తుంటే దాడులకు పాల్పడుతున్నారని తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు.

Updated Date - 2021-07-27T05:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising