ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల సమస్యలపై దశలవారీ పోరాటానికి సిద్ధం

ABN, First Publish Date - 2021-12-04T05:48:29+05:30

పీఆర్సీ ప్రకటించాలని, పెం డింగులో వున్న డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్‌ రద్దు చేయడంతో పాటు ఉద్యోగులకు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఏపీ జేఏసీ కార్యవర్గం డిమాండ్‌ చేసింది.

సమావేశంలో పాల్గొన్న జేఏసీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ ఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానం

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 3: పీఆర్సీ ప్రకటించాలని, పెం డింగులో వున్న డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్‌ రద్దు చేయడంతో పాటు ఉద్యోగులకు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఏపీ జేఏసీ కార్యవర్గం డిమాండ్‌ చేసింది. శుక్రవారం ఏపీ ఎన్జీవో జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యవసర సమా వేశం నిర్వహించారు. ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బుద్దాటి రామ్మోహన రావు, ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్‌, కార్యదర్శి పాలపర్తి మూర్తి బాబు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్యాచ రణ రూపొందించామన్నారు. ఈ నెల 7 నుంచి పదో తేదీ వరకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతారన్నారు. అన్ని తాలూకా కేంద్రాల్లో 13న నిరసన ర్యాలీ నిర్వహించడంతో పాటు 16వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరసన తెలుపుతారని, 21న జిల్లా కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన చేపడతామన్నారు. 27న విశాఖపట్నం, 30న తిరుపతి, 2022 జనవరి 3న ఏలూరు, 6న ఒంగోలుల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఉద్యోగులంతా పాల్గొనాలని జేఏసీ చైర్మన్‌ రామ్మోహనరావు పిలుపునిచ్చారు. సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్‌ పితాని శ్రీనివాసరావు, ఎన్వీఎస్‌ఎస్‌ఎన దుర్గాప్రసాద్‌, పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-04T05:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising